AP: కొత్త పెన్షన్లకు సీఎం గ్రీన్ సిగ్నల్..మే నెల నుంచే పింఛన్ జారీ

Pension
x

Pension

Highlights

AP: ఆంధ్రప్రదేశలో ఏప్రిల్ 25 నుంచే స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పించారు. ఈ...

AP: ఆంధ్రప్రదేశలో ఏప్రిల్ 25 నుంచే స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పించారు. ఈ నెల30లోగా సంబంధిత పత్రాలు సమర్పిస్తే..మే 1 నుంచే పింఛను జారీ చేయనున్నట్లు సమాచారం. ఏపీ సర్కార్ రాష్ట్రంలోని వితంతువులకు చేదోడు అందించనుంది. ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కింద కొత్తగా 89, 788 మందికి పింఛన్లు అందించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పింఛన్ పొందుతున్న భర్త మరణించినట్లయితే భార్యకు తదుపరి నెల నుంచే పింఛణ్ అందించే విధంగా స్పౌజ్ కేటగిరీని గత ఏడాది నవంబర్ నుంచి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వం హయాం 2023 డిసెంబర్ 1 నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 అక్టోబర్ 31 మధ్య ఉన్న స్పౌజ్ కేటగిరీకి చెందిన అర్హులు 89, 788 మందికి మే నెల నుంచి పెన్షన్ రూ. 4000 అందజేయనున్నారు.

అర్హత ఉన్నవాళ్లు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని..అధికారులు సూచిస్తున్నారు. భర్త మరణ ధ్రువీకరణ పత్రం, అర్హురాలి ఆధార్ కార్డుతోపాటుగా మిగిలిన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించాలి. ఏప్రిల్ 25 నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 30లోపు ఈ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అధికార యంత్రాంగం వెరిఫై చేసి మే 1 నుంచి పింఛన్ అందిస్తుంది. ఒకవేళ ఎవరైనా ఆ లోపు నమోదు చేయనట్లయితే వారికి జూన్ 1 నుంచి పింఛన్ నగదు ఇస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories