తిరుమల భక్తులకు పూర్తి రక్షణ : సీఎం చంద్రబాబు

తిరుమల భక్తులకు పూర్తి రక్షణ : సీఎం చంద్రబాబు
x
Highlights

తిరుమలకు వచ్చే దేశ విదేశీ భక్తులకు పూర్తి రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో ఈరోజు నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.

తిరుపతి:తిరుమలకు వచ్చే దేశ విదేశీ భక్తులకు పూర్తి రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో ఈరోజు నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం తిరుపతి, కలియుగ వైకుంఠంగా పిలిచే తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారని, వారికి పూర్తి రక్షణ కల్పించిననాడే, పోలీసులు అందించే సేవల పట్ల ప్రజల్లో గౌరవం పెరుగుతుందని చెప్పారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో సెక్యూరిటీ, సేఫ్టీ భావన ప్రజల్లో, భక్తుల్లో రావాలన్నారు. తిరుపతిలో నూతన జిల్లా పోలీసు కార్యాలయం అద్భుతంగా నిర్మించారని కొనియాడారు. పరిసరాలు అందర్నీ ఆకట్టుకునేలా ఆహ్లాదంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.

గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు కృషి చేస్తున్న తిరుపతి పోలీసులకు అభినందనలు తెలిపారు. పీడీ యాక్టు పెట్టి, సస్పెక్ట్ షీట్లు తెరిచి నిఘా పెట్టారని, ఎర్రచందనం స్మగ్లింగ్ ను సమర్ధంగా అరికడుతున్నారని ప్రశంసించారు. సమాజ హితం లేని, రాజ్యాంగపరంగా లేని, చట్టవిరుద్ధమైన చర్యలు ఎప్పుడూ ఆమోదయోగ్యం కావని చెప్పారు. అక్రమాలకు పాల్పడితే టీడీపీ వారైనా కేసులు పెట్టి జైళ్లకు పంపించామని గుర్తు చేశారు. రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ అని ప్రకటించామని, కొందరు సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నానని తెలిపారు.

2019-24 మధ్య పాలకులు శాంతిభద్రతలు భ్రష్టు పట్టించారని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమల తిరుపతిలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారని విమర్శించారు. తాము ఎప్పుడు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో హత్యారాజకీయాలను ఎప్పుడూ ప్రోత్సహించలేదని, శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విధానాల పేరుతో రౌడీయిజం చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. రోడ్లు బ్లాక్ చేయటం, రప్పా రప్పా లాడించటం ఏమిటో ఎవరికీ ఆర్ధం కావటం లేదన్నారు. పోస్టర్ల వద్ద కత్తులతో జంతు బలి చేసి ఫ్లెక్సీలపై రక్తం చల్లి సమాజాన్ని భయబ్రాంతులకు గురిచేస్తారా.? అని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories