Ambedkar Konaseema District: ఇంట్లో నిల్వ చేసిన దీపావళి టపాసులు పేలి దంపతులు సజీవ దహనం

Ambedkar Konaseema District: ఇంట్లో నిల్వ చేసిన దీపావళి టపాసులు పేలి దంపతులు సజీవ దహనం
x

Ambedkar Konaseema District: ఇంట్లో నిల్వ చేసిన దీపావళి టపాసులు పేలి దంపతులు సజీవ దహనం

Highlights

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మందు గుండు సామగ్రి పేలి దంపతులు మృతి చెందారు. అయినవెల్లి మండలం విలాస గ్రామంలోని ఓ ఇంట్లో దీపావళి టపాసుల సామగ్రి నిల్వ చేశారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మందు గుండు సామగ్రి పేలి దంపతులు మృతి చెందారు. అయినవెల్లి మండలం విలాస గ్రామంలోని ఓ ఇంట్లో దీపావళి టపాసుల సామగ్రి నిల్వ చేశారు. అది ఒక్కసారిగా పేలడంతో.. శ్రీనివాస్, సీత దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వారి కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది.

గాయపడిన కుమారుడిని అమలాపురం ఆస్పత్రికి తరలించారు. టపాసుల మందుగుండు పేలుడు ధాటికి మృతదేహాలు ఇంటి ప్రహారీ గోడ మధ్యలో చిక్కుకుపోయాయి. డెడ్‌బాడీలను బయటికి తీయడానికి సిబ్బంది కష్టపడాల్సి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories