మొంథా తుఫాన్‌తో ముంచెత్తిన శ్రీకాకుళం.. పంటల నష్టంతో రైతుల ఆవేదన

మొంథా తుఫాన్‌తో ముంచెత్తిన శ్రీకాకుళం.. పంటల నష్టంతో రైతుల ఆవేదన
x

మొంథా తుఫాన్‌తో ముంచెత్తిన శ్రీకాకుళం.. పంటల నష్టంతో రైతుల ఆవేదన

Highlights

శ్రీకాకుళం జిల్లాను ముంచిన మొంథా తుఫాన్‌ వరద నీటిలో పంటలు మొత్తం నీటమునిగాయని రైతుల ఆవేదన ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, నరసన్నపేట, పలాస, టెక్కలిలో,.. సుమారుగా 1500 హెక్టార్లలో నేలకు ఒరిగిన వరి పంట

శ్రీకాకుళం జిల్లాను ముంచిన మొంథా తుఫాన్‌

వరద నీటిలో పంటలు మొత్తం నీటమునిగాయని రైతుల ఆవేదన

ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, నరసన్నపేట, పలాస, టెక్కలిలో,..

సుమారుగా 1500 హెక్టార్లలో నేలకు ఒరిగిన వరి పంట

నరసన్నపేట, పోలాకి, గార, జలుమూరు ప్రాంతాల్లో పాడైన పంటలు

పాలకొండ వీరఘట్టాం మండలాల్లో 450 ఎకరాల్లో వరి నష్టం

బూర్జ మండలంలో నీటిలో ఉన్న 50 ఎకరాల పంట

ఇచ్చాపురం నాలుగు మండలాల్లో విస్తారంగా కురిసిన వర్షాలు

ఇన్నీసుపేట గ్రామాన్ని ముంచెత్తిన దన్నుగడ్డ వరదనీరు

నాగావళి, వంశధార నదుల్లో పెరుగుతున్న వరద ఉధృతి

2025 ఖరీఫ్ సీజన్ తమకు అచ్చురాలేదని రైతులు కన్నీరు

ఖరీఫ్లో సకాలంలో సాగు ఎరువులు ఇస్తే,..

పంటలు పాడైయ్యేవి కాదు కదా అని ప్రశ్నిస్తున్న అన్నదాతలు

ప్రభుత్వం నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని రైతుల విజ్ఞప్తి

అక్టోబర్, నవంబర్ నెలలు అంటేనే అమ్మో బాబోయ్ అంటున్నారు సిక్కొలు రైతులు.. ఈ నెలల్లో వచ్చే తుఫానులు మా కొంప కొల్లేరు చేస్తున్నాయంటూ తలలు పట్టుకుంటున్నారు. రైతుపై ప్రకృతి పగబట్టిందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తుఫానులు వచ్చి తమను నిండా ముంచేసాయంటూ ఆవేదన చెందుతున్నారు. పండిన పంటలు చేతికి రాకుండా నీటిపాలు అయ్యాయని గగ్గోలు పెడుతున్నారు. రైతుల బాధ వర్ణనాతీతంగా మారింది. ఏ దేవుడు వచ్చి మమ్మల్ని ఆదుకుంటాడని విలపిస్తున్నారు.

మొంథా తుఫాన్‌ శ్రీకాకుళం జిల్లాను ముంచేసింది. ఆరుగాలం కష్టపడ్డ రైతు శ్రమని వృధా చేసింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలు అంటేనే సిక్కొలు రైతులు భయాందోళన చెందుతున్నారు. 15రోజుల కిందట వచ్చిన అల్పపీడనంతో 50 శాతం వరి పంట నీట మునగా.. ఇప్పుడు చేతికొచ్చిన పంటను మళ్ళీ వరదలు ముంచేత్తడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, నరసన్నపేట, పలాస, టెక్కలిలో వరి పంట సుమారుగా 1500 హెక్టార్లలో ఒరిగిపోయింది. ఇది ప్రాధమిక అంచనా... కాని క్షేత్రస్థాయిలో ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది.

ఏకంగా 350 హెక్టార్లలో వరి పంట పాడైంది. నరసన్నపేట, పోలాకి, గార, జలుమూరు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పంటలు పాడయ్యాయి. ఇక పాలకొండ నియోజకవర్గంలో వీరఘట్టాం మండలాల్లో 450 ఎకరాల వరి మొత్తం నీట మునిగింది. బూర్జ మండలంలో కూడా 50 ఎకరాలు నీటిలో ఉందని స్థానిక రైతులు చెబుతున్నారు. ఇక మొక్కజొన్న పంట విషయానికొస్తే లావేరు మండలంలోని 10 గ్రామాలు.. మొక్కొజొన్న కట్ చేసి ఉంచడంతో అవి పూర్తిగా నానిపోయాయని వాపోతున్నారు.

ఇచ్చాపురంలోని నాలుగు మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఓ పక్క ఒరిస్సా నుంచి వచ్చిన వరద నీరు మరోపక్క వర్షపు నీటితో పలు గ్రామాల్లో పంట పొలాలు జలమయం అయ్యాయి. ఇచ్చాపురంలోని దన్నుగడ్డ ఉప్పొంగడంతో ఇన్నీసుపేట గ్రామాన్ని వరదనీరు ముంచెత్తింది. గ్రామంలోకి బహుదానది నీటితో పాటు దన్నుగడ్డ వరద నీరు రావడంతో గ్రామం మొత్తం జలమయం అయింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

నాగావళి, వంశధార నదుల్లో సైతం వరద ఉధృతి పెరిగింది. నదీ పరివాహక ప్రాంతాల్లో ఏవిధమైన ఇబ్బంది కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. తీర ప్రాంతాల్లో ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఒడిషా జిల్లాలో వర్షం కురుస్తున్నందున ఇంకా వరద ముంపు ఉందని యంత్రాంగం చెబుతోంది. నాగావళి, వంశదార నదులలో వర్షం నీరు రాకతో నిండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు నదులు స్థిరంగా ఉండడంతో జిల్లా యంత్రంగం, రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

2025 ఖరీఫ్ సీజన్ తమకు అచ్చురాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క ప్రకృతి తమ నడ్డి విరిచిందని.. మరో పక్క ఎరువుల కొరత.. వేసిన విత్తనం మరలా వేయడంతో తడిపిమోడైందంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఖరీఫ్లో సకాలంలో సాగు ఎరువులు ఇస్తే.. ఇంత ఖర్చు ఉండేది కాదు కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా రైతే రాజు. కాని.. నేడు రైతే కుదేలు అన్న చందాన ఉందంటున్నారు రైతు సంఘ నాయకులు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories