మొంథా తుఫాన్ ప్రభావం.. శ్రీకాకుళం తీరంలో అధికారులు అలర్ట్‌

మొంథా తుఫాన్ ప్రభావం.. శ్రీకాకుళం తీరంలో అధికారులు అలర్ట్‌
x

మొంథా తుఫాన్ ప్రభావం.. శ్రీకాకుళం తీరంలో అధికారులు అలర్ట్‌

Highlights

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంథా తుపానుగా మారిన వాయుగుండం శ్రీకాకుళం జిల్లాలో 3రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావవరణ శాఖ తీర ప్రాంత జిల్లాలపై తుఫాను ప్రభావం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. వాయుగుండం మొంథా తు‎ఫానుగా మారిన నేపథ్యంలో.. శ్రీకాకుళం జిల్లాలో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావవరణ శాఖ హెచ్చరించింది. దీంతో అన్నదాతల్లో గుబులు రేగుతోంది. తుఫాను ప్రభావం తీర ప్రాంత జిల్లాలపై ఉండనుందన్న వార్తలు రైతులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ తుఫాను పై అధికారులు ఏమంటున్నారు. తాజా పరిస్థితులపై ప్రత్యేక కథనం.

శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో మూడు విడతలు వరి, మొక్కజొన్న పంటలను వేశారు అన్నదాతలు. మొదటి దశ వేసిన వరి పంట కోతకు మరో 10 రోజులులో రాగా, రెండవ విడత వేసిన వరి పంట పొట్టదశలో ఉంది. మొక్కజొన్న పంట కూడా కోతలు అయి కొన్ని పొలాల్లో కళ్లాల్లో ఉన్నాయి.. ఇప్పుడు మొంథా తుఫాను అని అధికారులు తెలుపడంతో అన్నదాతలు బెంబేలు ఎత్తుతున్నారు. మొంథా తీవ్ర తుపాను కావడంతో గాలులకు పంట నేలవాలుతుందన్న భయం వెంటాడుతోంది. పంట చేతికొచ్చే సమయంలో తుఫాను హెచ్చరికలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

తుఫాను నేపథ్యంలో భాగంగా జిల్లాకు ప్రత్యేకాధికారిగా కె.వి.ఎన్ చక్రధర్బాబును నియమించింది. తుఫానుపై అధికారులను అప్రమత్తం చేసేందుకు ఇన్ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను ప్రభావంతో 30వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని.. వాతావరణశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. రైతులు పంటలు జాగ్రత్త చేసుకోవాలని సూచించారు. తీరప్రాంత మండలాల్లో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. మత్స్యకారులు బోట్లు ఒడ్డుకు తీసుకొని వచ్చి.. సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచించారు.

తుపాను నేపథ్యంలో ఎస్ఆర్ఎఫ్, ఎన్ఆర్ఎఫ్ బృందాలు జిల్లాకు చేరుకోనున్నాయి. మరోవైపు తీర ప్రాంత, లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లను అధికారులను చేస్తున్నారు. తీర ప్రాంత మండలాల్లో అధికారులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో జనరేటర్లు, డీజిల్, తాగునీరు వంటి వాటిని సిద్ధం చేస్తున్నారు. తుపాను తీవ్రత దృష్ట్యా సహాయక చర్యల్లో అందుబాటులో ఉండేందుకు ఉద్యోగులకు సెలవులను రద్దు చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని.. అధికారుల సూచనలను తప్పక పాటించాలని డి.ఆర్.ఒ వెంకటేశ్వరరావు కోరారు.

తుఫాను నేపథ్యంలో గాలులకు విద్యుత్తు తీగలు, చెట్లు కూలీ ప్రమాదం ఉన్నందున గ్రామీణ, పట్టణ ప్రాంతవాసులు ఇళ్లకే పరిమితం అవ్వాలని ఇన్‌ ఛార్జి కలెక్టర్ విజ్ఙప్తి చేశారు. 15 రోజుల కిందటే వరదలు, వాయుగుండం భారీన పడి నష్టపోయిన రైతులు.. మొంథా తుఫాను మరో గుదిబండ అవ్వనుందా అని లబోదిబోమంటున్నారు. జరగరానిది జరిగితే అన్నదాతలను వెంటనే ఆదుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories