Kakinada: కాకినాడ జిల్లా పేరు మార్పుపై మళ్లీ చర్చ వేడి

Kakinada: కాకినాడ జిల్లా పేరు మార్పుపై మళ్లీ చర్చ వేడి
x

Kakinada: కాకినాడ జిల్లా పేరు మార్పుపై మళ్లీ చర్చ వేడి

Highlights

కాకినాడ జిల్లా పేరు మారుతుందా..? తెరపైకి పలువురు ప్రముఖుల పేర్లు కాకనందివాడ వంశీయుల పేరిట కాకినాడ పేరు కో-కెనడాగా పిలిచిన బ్రిటీష్‌ పరిపాలకులు నాయకర్ పేరు పెట్టాలని సాధన సమితులు

కాకినాడ జిల్లా పేరు మార్పు మళ్లీ తెరపైకి వచ్చింది. భిన్న వర్గాల నుంచి ప్రముఖుల వినిపిస్తున్నాయి. పిఠాపురం రాజా వారి పేరు పెట్టాలని కొందరు... మల్లాడి సత్యలింగ నాయక్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ పేరునే కొనసాగించాలని మరికొందరు చెబుతున్నారు. కాకినాడ జిల్లా పేరు మార్పు ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది.


ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో ఎందరో మహానుభావులున్నారు. పేదల విద్యాభివృద్ధి కోసం తమ ఆస్తులను దానం చేశారు. అలాంటి ప్రముఖుల్లో పిఠాపురం రాజా రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహుదూర్ ఉన్నారు. ఆయన కాలంలో విద్యాభివృద్ధి కోసం వేల ఎకరాల్లో పాఠశాలలు, కళాశాలలు, సత్రాలు నిర్మించారు. కాకినాడలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ అవి ఆయన పేరు మీదే కొనసాగుతున్నాయి.


కాకినాడ కోరంగి వద్ద జన్మించిన మల్లాడి సత్యలింగ నాయకర్ బర్మా, రంగూన్‌లో ఎగుమతులు, దిగుమతుల వ్యాపారం చేసే వారు. లక్షలు సంపాదించిన నాయకర్ జగన్నాధపురంలో భూమి కొనుగోలు చేసి MSN చారిటీస్ విద్యా సంస్థను నెలకొల్పారు. ఈ ప్రాంతంలో విద్యా అభ్యున్నతికి బాటలు వేశారు. తన సేవలతో ప్రతి ఒక్కరి హృదయంలో చెరగని ముద్ర వేసుకున్నారు నాయకర్. కాకినాడకు చెందిన మహర్షి బులుసు సాంబమూర్తి తనకున్న యావదాస్తిని దేశ స్వాతంత్ర్య కోసం అఖిల భారత కాంగ్రెస్‌‌కు ఖర్చు పెట్టారు. విక్టోరియా మహారాణికి 100 ఎకరాల భూమి దానంగా ఇచ్చారని చరిత్ర చెబుతోంది. కాకినాడలో ప్రస్తుతం కుళాయి చెరువు ఉన్న ప్రాంతం అదేనని చెబుతున్నారు. శ్రీమంతుడు సీవీకే రావు అప్పట్లోనే విదేశాల్లో ఐఏఎస్ చదువుకుని స్వాతంత్య సంగ్రామంలో పాల్గొన్నారు. కాకినాడ ఎమ్మెల్యేగా పదవి నిర్వహించారు. ప్రముఖులు పంతం పద్మనాభం, ఏఎస్‌ఆర్ మూర్తి, విద్యపురెడ్డి వంశీయుల పేర్లు వినిపిస్తున్నాయి. కాకినాడ జిల్లా పేరును మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టాలనే డిమాండ్‌తో సాధన సమితులు ఏర్పాటయ్యాయి. కలెక్టరేట్‌ వరకు ర్యాలీలు జరిపారు. మీటింగ్‌లు నిర్వహించారు.


అయితే ఈప్రాంతాన్ని 500ఏళ్లు పరిపాలించిన కాకనందివాడ వంశీయుల పేరిట కాకినాడ పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. కాకనందివాడ వంశీకుల తర్వాత ఫ్రెంచ్‌ వారు, బ్రిటీష్‌ వారు పరిపాలించిన కాలంలో కాకినాడలో కెనడా పోలికతో రోడ్లు, సముద్రాలు, సెలయేర్లు ఉండటంతో వారు కో-కెనడాగా పిలిచేవారు. ఎంతో చరిత్ర కలిగిన కాకినాడ పేరుతో కొనసాగించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ జిల్లా పేరు మార్పు జరుగుతుందా లేదా అనేది పక్క పెడితే ప్రభుత్వం ఎటువైపు మొగ్గు చూపుతుందనే విష‍యం ఉత్కంఠగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories