Dr. Manthena Satyanarayana Raju: డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియామకం

Dr. Manthena Satyanarayana Raju: డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియామకం
x

Dr. Manthena Satyanarayana Raju: డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియామకం

Highlights

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారుగా నియమించింది.

అమరావతి: ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. ప్రకృతి వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన ఆయన, ఏపీ ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాలు అందిస్తారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు.

డాక్టర్ మంతెన దశాబ్దాలుగా ప్రజలకు ప్రకృతి వైద్యం ద్వారా ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ఉండవల్లి కరకట్టపై "ప్రకృతి చికిత్సాలయం" పేరుతో ఆసుపత్రి స్థాపించారు. అంతేకాక, విజయవాడ, నరసాపురంలోనూ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.

డాక్టర్ మంతెనతో పాటు పోచంపల్లి శ్రీధర్‌రావును (మాస్ కమ్యూనికేషన్) కూడా సలహాదారుగా నియమించారు. వీరు రెండేళ్ల పాటు తమ పదవుల్లో కొనసాగనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories