అనంతపురం సింగనమల KGBVలో ఫుడ్ పాయిజన్‌... 80 మంది విద్యార్థులకు అస్వస్థత

Eighty Students Sick With Food Poisoning
x

ఫుడ్ పాయిజన్‌తో 80 మంది విద్యార్థులకు అస్వస్థత

Highlights

* విద్యార్థులను ఆస్పత్రికి తరలింపు, కొనసాగుతున్న చికిత్స

Ananthapur: అనంతపురం జిల్లా సింగనమల కస్తూర్భా విద్యాలయంలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. సుమారు 80 మంది విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతుండడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 30 మంది పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగితా 50 మంది విద్యార్థులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యాలయంలో నిన్న సాయంత్రం అల్పాహారం తీసుకున్న అనంతరం ఫుడ్ పాయిజన్ అయిందని విద్యార్ధులు చెబుతున్నారు. విద్యార్ధులను ఎమ్మెల్యే పరామర్శించారు. విద్యార్ధులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఎమ్మెల్యే ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories