RK Roja: ఏపీలో 'రూల్ ఆఫ్ లా' ఎక్కడ? - కూటమి ప్రభుత్వంపై రోజా నిప్పులు!

RK Roja: ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగిన నాటి నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే లక్ష్యంగా దాడుల పరంపర కొనసాగుతోందని మాజీ మంత్రి రోజా తీవ్ర ఆరోపణలు చేశారు.
RK Roja: ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగిన నాటి నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే లక్ష్యంగా దాడుల పరంపర కొనసాగుతోందని మాజీ మంత్రి రోజా తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్న 'రూల్ ఆఫ్ లా' అంటే ఇదేనా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు.
నేతల ఇళ్లపై దాడుల పర్వం: రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలపై జరిగిన దాడుల జాబితాను ఈ సందర్భంగా రోజా మీడియా ముందు ఉంచారు. మాజీ మంత్రులు, కీలక నేతల నివాసాలే లక్ష్యంగా దాడులు జరగడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆమె మండిపడ్డారు.
టార్గెట్ అయిన నేతలు: అంబటి రాంబాబు, జోగి రమేశ్, కొడాలి నాని, పేర్ని నాని, దాడిశెట్టి రాజా, వల్లభనేని వంశీ, ముద్రగడ పద్మనాభం వంటి నేతల ఇళ్లపై దాడులను ఆమె తీవ్రంగా ఖండించారు.
ఆఫీసులపై దాడులు: హిందూపురం పార్టీ కార్యాలయం, మార్గాని భరత్ ఆఫీసులతో పాటు భూమన కరుణాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి వంటి సీనియర్ల ఇళ్లను కూడా వదలలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా నేతలపై వేధింపులు: విడదల రజినిపై దాడికి యత్నించారని, తనపై కూడా ఒక వ్యక్తిని ప్రయోగించి సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పదజాలంతో దాడి చేయిస్తున్నారని రోజా ధ్వజమెత్తారు.
మీడియా సంస్థలకూ తప్పని ముప్పు: రాజకీయ కక్షసాధింపులు కేవలం నాయకులతోనే ఆగలేదని, పత్రికా కార్యాలయాలపై కూడా దాడులు జరుగుతున్నాయని రోజా ఆరోపించారు. సాక్షి, డెక్కన్ క్రానికల్ వంటి మీడియా సంస్థలపై జరిగిన దాడులు పత్రికా స్వేచ్ఛను హరించడమేనని ఆమె విమర్శించారు.
ప్రభుత్వమే బాధ్యత వహించాలి: రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మౌనంగా ఉండటం దారుణమని రోజా పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలను అంతం చేయాలనే ధోరణి సరైంది కాదని, ఈ దాడులన్నింటికీ చంద్రబాబు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



