Free Bus Scheme: ఉచిత బస్ స్కీమ్‌పై ఏపీ క్యాబినెట్ క్లారిటీ.. మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రయోజనం!

Free Bus Scheme: ఉచిత బస్ స్కీమ్‌పై ఏపీ క్యాబినెట్ క్లారిటీ.. మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రయోజనం!
x

Free Bus Scheme: ఉచిత బస్ స్కీమ్‌పై ఏపీ క్యాబినెట్ క్లారిటీ.. మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రయోజనం!

Highlights

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్ ప్రయాణ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ విషయంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ‘స్త్రీ శక్తి’ పేరుతో ఈ పథకాన్ని ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు.

ఏ బస్సుల్లో ఉచితం?

ఈ పథకం కింద పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. మొత్తం 8,456 బస్సుల్లో ఈ ఫీచర్ అమలులో ఉంటుంది.

ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం?

ఉచిత ప్రయాణానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లేదా ఓటర్ ఐడీ కార్డు చూపడం సరిపోతుంది.

స్త్రీ శక్తి పథకం ప్రయోజనాలు:

ఈ స్కీమ్ ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు సుమారుగా రూ.800 వరకూ ప్రయోజనం చేకూరుతుందని అంచనా. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో (తె.లంగాణ, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక) ఈ విధమైన పథకాలు అమలులో ఉండగా, ఏపీ రాష్ట్రంలో మరింత సమగ్రంగా ఈ స్కీమ్ అమలు చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.

ఇతర కీలక ప్రకటనలు:

రాష్ట్రంలో ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఆహ్వానిస్తూ పెట్టుబడులకు అవకాశం కల్పించనున్నారు.

నాయీబ్రాహ్మణులు, మత్స్యకారులకు గౌరవ వేతనాలు పెంచారు.

హెయిర్ కటింగ్ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తున్నారు.

తెలంగాణలో మాదిరిగానే ఎట్టకేలకు ఏపీలో కూడా ఈ పథకం అమలుకాబోతుండటంతో మహిళల్లో ఉత్సాహం నెలకొంది. గతంలో వచ్చిన వార్తలు కేవలం జిల్లాలకే పరిమితం చేస్తారన్నవైనా.. చివరికి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories