TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..వసతి ఇక మరింత సులువు..ఎలాగో తెలుసా?

TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..వసతి ఇక మరింత సులువు..ఎలాగో తెలుసా?
x
Highlights

TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుని ముక్కులు చెల్లించుకుంటున్నారు.

TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుని ముక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు బస చేసేందుకు గదులు దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఈ సమస్య నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు టీటీడీ భక్తులకు కీలక సూచన చేసింది. తిరుమలలో గదుల కోసం ఎలా ప్రయత్నించాలి అనే విషయాలను వివరిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది టీటీడీ.

తిరుమలకు వచ్చిన భక్తులు గదుల కోసం తిరుమల బస్టాండ్ దగ్గర ఉన్న సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ కు నేరుగా వెళ్లండి. అక్కడ మీ ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీ మొబైల్ కు గది కేటాయింపు వివరాలతో ఒక మెసేజ్ వస్తుంది. అయితే ఒక విషయం గమనించాలి. ఏంటంటే మొదట వచ్చిన వారికి తొలి ప్రాధాన్యం ఇస్తారు. ముందుగా సీఆర్ఓ కార్యాలయానికి చేరుకున్న భక్తులకు గదులు కేటాయిస్తారు. ఈ కార్యలయం ఉదయం 6గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తుల కోసం అందుబాటులో ఉంటుంది. తిరుమలలో గదుల కోసం ఇబ్బందులు పడకుండా నేరుగా సీఆర్ఓ కార్యాలయానికి వెళ్లి, రూమ్స్ సులభంగా పొందే ఈ సౌకర్యాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories