Guntur: బ్యాంక్ కుంభకోణం.. బయట పడేదెన్నడు?

Guntur: బ్యాంక్ కుంభకోణం.. బయట పడేదెన్నడు?
x

Guntur: బ్యాంక్ కుంభకోణం.. బయట పడేదెన్నడు?

Highlights

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సహకార సొసైటీలో పెద్దస్థాయిలో కుంభకోణం జరిగింది.. ఎన్నో సంవత్సరాల నుంచి రైతులు ఈ సహకార బ్యాంక్ ద్వారా రుణాలు పొందారు .

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సహకార సొసైటీలో పెద్దస్థాయిలో కుంభకోణం జరిగింది.. ఎన్నో సంవత్సరాల నుంచి రైతులు ఈ సహకార బ్యాంక్ ద్వారా రుణాలు పొందారు ..మరెన్నో రాయితీలు పోందారు.గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా సహకార సొసైటీలను అడ్డగోలుగా కొందరు దోచేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పంట పొలాలపై రైతులకు రుణాలు ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాటైన సహకార సొసైటీల్లో గత వైసీపి ప్రభుత్వం తమ సొంత మనుషులను పెట్టుకొని రైతుల పేరుతో నకిలీ రుణాలు తీసుకొన్నారని ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా రాతంశెట్టి రామాంజనేయులు ఉన్నప్పటికీ అనధికార పెత్తనం మొత్తం జిల్లాకు చెందిన వైసీపి కీలక నేత మేనల్లుడే చూసారన్నది బహిరంగ రహస్యం. అసలు భూ యజమానికి తెలియకుండా నకిలీ రైతులను సృష్టించి వందల కోట్ల రుణాలను తీసుకొని లెక్కపత్రం లేకుండా వ్యవహరించినట్లు ఆరోపణలు వెళ్లువెత్తాయి.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని బ్యాంకులలో ఈ నకిలీ రుణాల భాగోతం వెలుగులోకి వచ్చాయి. దీంతో జిల్లా కలెక్టర్ కు, ఆ శాఖ మంత్రికి బ్యాంకులపై ఫిర్యాదులు అందాయి. రుణాల వ్యవహారం తేల్చాలంటూ కూడా జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం లో వైసీపీ నేతలు వందల కోట్ల రూపాయలు సహకార సొసైటీలో సొమ్మును దోచుకున్నారని వీటికి సంబంధించిన ఆధారాలు కూడా బయట పెడతామంటూ పలువురు ఎమ్మెల్యేలు ప్రకటనలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తైనా...ఇంతవరకు సహకార సొసైటీలలో జరిగిన కుంభకోణానికి సంబంధించి ఎలాంటి పురోగతి లేకపోవడంపై జిల్లా వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నూతన చైర్మన్ గా వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావును ప్రభుత్వం నియమించింది. నూతన చైర్మన్ వచ్చిన తర్వాత అయినా గత ప్రభుత్వంలో జరిగిన రుణాల కుంభకోణం వెలికితీస్తారని భావించినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అన్నీ తెలిసి వైసీపీ నేతలతో కూటమి నేతలు మిలాఖత్ అయ్యారా...లేక ఈ కుంభకోణంపై విచారణ చేయవద్దంటూ పైనుంచి ఒత్తిడి ఏమైనా ఉందా అనే కోణంలో కూటమి నేతలే చర్చించుకోవడం విశేషం.. ఇప్పటికైనా కూటమి నేతలు అసలు జరిగిందేమిటో చెప్పాలని.. అసలు రుణాల కుంభకోణం జరిగిందా.. లేక నేతలే తప్పుడు సమాచారం ఇచ్చారా.. లేక విచారణకు సమయం పడుతోందా అన్న విషయం క్లారిటీ ఇవ్వాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories