Guntur: ఆ ఫొటోలే ఆమె పాలిట శాపమయ్యాయి!

Guntur: ఆ ఫొటోలే ఆమె పాలిట శాపమయ్యాయి!
x

Guntur: ఆ ఫొటోలే ఆమె పాలిట శాపమయ్యాయి!

Highlights

Guntur Crime News: ప్రేమ పేరుతో వంచించడమే కాకుండా, వ్యక్తిగత ఫోటోలతో వేధింపులకు గురిచేస్తూ ఒక నిండు ప్రాణం బలి కావడానికి కారణమయ్యాడో ఉన్మాది.

Guntur Crime News: ప్రేమ పేరుతో వంచించడమే కాకుండా, వ్యక్తిగత ఫోటోలతో వేధింపులకు గురిచేస్తూ ఒక నిండు ప్రాణం బలి కావడానికి కారణమయ్యాడో ఉన్మాది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పోలకంపాడులో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

పోలకంపాడుకు చెందిన శ్రీనివాసరెడ్డి, రమణమ్మ దంపతుల కుమార్తె మీనాక్షి (డిగ్రీ విద్యార్థిని) అదే కాలేజీలో చదువుతున్న రహీం అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి కొన్ని ఫోటోలు తీసుకున్నారు. అయితే, రహీం ప్రవర్తనపై అనుమానం రావడంతో మీనాక్షి అతడిని దూరం పెట్టింది.

ఫోటోలతో బ్లాక్‌మెయిల్:

మీనాక్షి తనతో మాట్లాడకపోవడాన్ని తట్టుకోలేకపోయిన రహీం కక్ష పెంచుకున్నాడు. తనతో రూమ్‌కు రావాలని, లేదంటే వారిద్దరి ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని, మార్ఫింగ్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. ఈ విషయం తెలుసుకున్న మీనాక్షి తల్లిదండ్రులు ఆమెకు ధైర్యం చెప్పారు, భయపడవద్దని ఓదార్చారు.

అంతం కాని వేధింపులు.. విషాద ముగింపు:

తల్లిదండ్రులు అండగా నిలిచినా, రహీం వేధింపులు ఆగకపోవడంతో మీనాక్షి తీవ్ర మనోవేదనకు గురైంది. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువు చాలించింది. సాయంత్రం పనుల నుంచి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు విగతజీవిగా పడి ఉన్న కుమార్తెను చూసి కన్నీరుమున్నీరయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడు రహీంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories