తిరుపతిలో కుండపోత వర్షాలు – చెరువులు నిండిపోయి అలెర్ట్‌లో అధికారులు

తిరుపతిలో కుండపోత వర్షాలు – చెరువులు నిండిపోయి అలెర్ట్‌లో అధికారులు
x

తిరుపతిలో కుండపోత వర్షాలు – చెరువులు నిండిపోయి అలెర్ట్‌లో అధికారులు

Highlights

తిరుపతి జిల్లాలో వారం రోజులుగా కుండపోత వర్షాలు పొంగిపొర్లుతున్న వాగులు వంకలు నాలుగు మండలాల్లో స్తంభించిన జనజీవనం

తిరుపతి జిల్లా గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షానికి నాలుగు మండలాల్లో జనజీవనం స్తంభించింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వచ్చిన వరద నీటితో ఏర్పేడు, శ్రీకాళహస్తి మండలాల్లోని చెరువులన్నీ పూర్తిగా నిండిపోవటంతో.. సువర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఇప్పటికే కొన్ని చెరువులకు గండ్లు పడగా, రైతులు వాటిని పూడ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాంగం అప్రమత్తమై ప్రమాదకర పరిస్థితులు ఉన్న చెరువుల వద్ద కాపు కాస్తున్నారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories