ఏపీలో రాజ్యసభ ఎన్నికలు: టీడీపీ అభ్యర్ధులు వీరే?

Here are The TDP Rajya Sabha Candidates
x

ఏపీలో రాజ్యసభ ఎన్నికలు: టీడీపీ అభ్యర్ధులు వీరే?

Highlights

Rajya Sabha Candidates: రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులుగా బీద మస్తాన్ రావుకు మరోసారి అవకాశం దక్కనుంది.

Rajya Sabha Candidates: రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులుగా బీద మస్తాన్ రావుకు మరోసారి అవకాశం దక్కనుంది. కాకినాడకు చెందిన సానా సతీష్ ను మరో అభ్యర్ధిగా ఆ పార్టీ బరిలోకి దింపే అవకాశం ఉంది. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్యలు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు వైఎస్ఆర్ సీపీ నుంచి ప్రాతినిథ్యం వహించారు. వీరి పదవి కాలం పూర్తి కాకుండానే ముగ్గురు రాజీనామా చేశారు.

ఏపీ అసెంబ్లీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి బలం ఉంది. దీంతో ఈ మూడు స్థానాలు కూటమికే దక్కే అవకాశం ఉంది. మూడు స్థానాల్లో ఒకటి బీజేపీ, రెండు స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీద మస్తాన్ రావు టీడీపీని వీడి వైఎస్ఆర్ సీపీలో చేరారు. ఆ తర్వాత ఆయనకు రాజ్యసభకు పంపింది ఆ పార్టీ. ఈ ఏడాది మే లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ ముగ్గురు ఎంపీలు రాజీనామా చేశారు. ఈ ముగ్గురు రాజీనామా చేయడం వెనుక టీడీపీ హస్తం ఉందని అప్పట్లో వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆరోపించారు.

రాజ్యసభలో టీడీపీకి ప్రస్తుతం ప్రాతినిథ్యం లేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. ఆ పార్టీ 23 స్థానాలకే పరిమితమైంది. దీంతో రాజ్యసభకు సభ్యులను పంపే బలం ఆ పార్టీకి లేకుండా పోయింది. దీంతో రాజ్యసభలో ఆ పార్టీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత రాజ్యసభలో ఆ పార్టీ ప్రాతినిథ్యం లేకుండా పోవడం బహుశా ఇదే ప్రథమంగా చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories