logo
ఆంధ్రప్రదేశ్

Tirupati: హైటెక్ సెక్స్‌ రాకెట్‌ గుట్టురట్టు.. సంచలన నిజాలు వెలుగులోకి..

High-Tech Sex Racket Busted in Tirupati
X

Tirupati: హైటెక్ సెక్స్‌ రాకెట్‌ గుట్టురట్టు.. సంచలన నిజాలు వెలుగులోకి..

Highlights

Tirupati: అంతా ఆన్‌లైన్‌లోనే.. ఏ మాత్రం అనుమానమే రాదు వాట్సాప్‌లో వచ్చిన ఫొటోకు ఓకే చెప్తే చాలు నచ్చిన అతివ క్షణాల్లోనే ఒళ్లో చేరిపోతుంది.

Tirupati: అంతా ఆన్‌లైన్‌లోనే.. ఏ మాత్రం అనుమానమే రాదు వాట్సాప్‌లో వచ్చిన ఫొటోకు ఓకే చెప్తే చాలు నచ్చిన అతివ క్షణాల్లోనే ఒళ్లో చేరిపోతుంది. కావాల్సిందల్లా కాసులు మాత్రమే.! ఇదంతా ఆధ్యాత్మిక నగరం తిరుపతి కేంద్రంగా జరుగుతున్న హైటెక్ వ్యభిచారం గురించే.!

ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో హైటెక్ వ్యభిచారం గుట్టురట్టయింది. తిరుపతి శ్రీనగర్ కాలనీలో టెక్నాలజీని ఆసరాగా తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. వాట్సాప్ ద్వారా విటులను ఆకర్షించి ఈ మొత్తం తతంగాన్ని నడుపుతున్నట్లు తిరుపతి పోలీసులు గుర్తించారు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకులు, నలుగురు విటులను అరెస్ట్ చేశారు.

మరోవైపు అరెస్టు అనంతరం పోలీసుల విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దందా నిర్వహిస్తోంది మహిళలే అని తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. బెంగుళూరు, గుడివాడ తదితర ప్రాంతాల నుంచి యువతులను రప్పించి వాట్సాప్ ద్వారా ఫొటోలు షేర్ చేస్తూ ఏ మాత్రం అనుమానం రాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరి నుంచి కొందరు యువతులను రక్షించినట్లు తెలిపిన పోలీసులు మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.


Web TitleHigh-Tech Sex Racket Busted in Tirupati
Next Story