Vangalapudi Anitha: గంగమ్మ ఆలయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది

Vangalapudi Anitha: గంగమ్మ ఆలయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది
x
Highlights

Vangalapudi Anitha: తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు.

Vangalapudi Anitha: తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న హోంమంత్రికి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంటే కలిగే ఆధ్యాత్మిక అనుభూతి, గంగమ్మ తల్లి దర్శనంతోనూ కలుగుతుందని మంత్రి అనిత అన్నారు. గంగమ్మ ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రజలంతా క్షేమంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు హోంమంత్రి వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories