పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు : జనసేన సూచన

పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు : జనసేన సూచన
x
Highlights

తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు కారణమైన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం అనేకమందికి ఆదర్శంగా నిలుస్తుందని, అలాంటి మహానుభావుడు పేరు పోలవరం ప్రాజెక్టుకు పెట్టాలన్న జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనను బలంగా సమర్థిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు చెప్పారు.

మంగళగిరి: తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు కారణమైన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం అనేకమందికి ఆదర్శంగా నిలుస్తుందని, అలాంటి మహానుభావుడు పేరు పోలవరం ప్రాజెక్టుకు పెట్టాలన్న జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనను బలంగా సమర్థిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు చెప్పారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో జనసేన నేత, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ పెనుగొండ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పలువురు ఆర్య వైశ్యులు ఆదివారం జనసేన పార్టీలో చేరారు. శానస మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ తో కలసి వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నాగబాబు గారు మాట్లాడుతూ “ఆర్యవైశ్యులు అనగానే ప్రథమంగా గుర్తుకొచ్చేది అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరులో డిగ్రీ విద్యనభ్యసిస్తున్నప్పుడు కళాశాలలో శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం ఉండేదని, ప్రతి రోజూ ఆయనకు నమస్కరించి తరగతి గదిలో అడుగుపెట్టేవాళ్ళం. హిస్టరీ విద్యార్థిగా అమరజీవి గురించి చదివి ఆయన జీవన విధానం గురించి తెలుసుకున్నాం. ఆయన జీవితం అనేక మందికి ఆదర్శంగా నిలుస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం కోసం, గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. గోదావరి జిల్లాలకు శుద్ధి చేసిన తాగు నీరు అందించే నీటి ప్రాజెక్టుకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పేరు పెట్టి ఆయన త్యాగాలను భవిష్యత్ తరాలు కూడా చెప్పుకొనేలా చేశారు” అన్నారు.

పార్టీ మూల సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాలి : హరిప్రసాద్

శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ... “ప్రజా సేవే పరమావధిగా బతికే అతికొద్ది మంది నాయకుల్లో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. మహోన్నత ఆశయాలు కలిగిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి 14 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు ఎదుర్కోవడం నేను స్వయంగా చూశాను. కూటమి ఏర్పాటు చేసి పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సప్తాశ్వాలు, సప్తరుషులు, సప్తగిరులకు ఎంత విశిష్టత ఉందో జనసేన మూల సిద్ధాంతాలకు అంతటి విశిష్టత ఉంది. ఈ సూత్రాల ఆధారంగా జనసేన ముందుకు వెళ్తుంది. పార్టీలో కొత్తగా చేరిన వారు ఆ మూల సూత్రాలను అర్ధం చేసుకుని ముందుకు వెళ్లాలి” అన్నారు. కొత్తగా పార్టీలో చేరుతున్న వారితో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తామని ప్రమాణం చేయించారు.

ఈ కార్య్రమంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, మాజీ శాసన సభ్యులు కిలారి రోశయ్య, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ పంచకర్ల సందీప్, శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు దేవకీ వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు గంజి చిరంజీవి, కండే రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories