Kurnool to Vijayawada flight services: ఇక కర్నూలు నుంచి విజయవాడకు విమానాలు తిరగబోతున్నాయ్

Kurnool to Vijayawada flight services
x

Kurnool to Vijayawada flight services: ఇక కర్నూలు నుంచి విజయవాడకు విమానాలు తిరగబోతున్నాయ్

Highlights

Kurnool to Vijayawada flight services: కర్నూలు నుంచి విజయవాడ తరచూ తిరిగేవాళ్లకు శుభవార్త. ఇక కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.

Kurnool to Vijayawada flight services: కర్నూలు నుంచి విజయవాడ తరచూ తిరిగేవాళ్లకు శుభవార్త. ఇక కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే వారానికి మూడు రోజుల పాటు కర్నూలు నుంచి విజయవాడకు సర్వీసులు ఉంటాయి. వీటిని ఇండిగో సంస్థ నడపనుంది. కర్నూలు టు విజయవాడ రెగ్యులర్‌‌గా తిరిగేవారకి ఇది నిజమైన శుభవార్తే.

ఈ సందర్బంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఏపీని లాజిస్టిక్ హబ్‌గా మార్చాలన్నదే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. విమానాశ్రయాల అభివృద్ధికి దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అదేవిధంగా కర్నూలు విమానాశ్రయాన్ని అభివృద్ది చేసే విషయంలో తమకు ఎప్పటికప్పుడు ఆయన సలహాలు, సూచనలు అందించారని వివరించారు. ఇప్పడు ఈ సర్వీస్ ప్రారంభం కావడంతో ఇటు కర్నూలు ప్రజలు అటు అనంతపురం ప్రజలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నాయుడు అన్నారు. అంతేకాదు, కర్నూలుతో పాటు భోగాపురం, నెల్లూరు, అనంతపురం, కుప్పం... ఇలా పలు ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాలను ఏర్పాటుచేయాలని చూస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు.

కర్నూలు టు విజయవాడ విమాన సర్వీసులు ప్రస్తుతం వారంలో మూడు రోజులు మాత్రమే ఉన్నాయని, ఆ తర్వా త ప్రతిరోజు తిరిగేలా చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రలు టీజీ భరత్, బీసీ జనార్ధన రెడ్డిలతో పాటు కొంతమంది ఎంపీలు, మరికొంతమంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories