అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరుత కలకలం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరుత కలకలం
x
Highlights

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరుత సంచారం.. తీవ్ర కలకలం రేపుతోంది.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరుత సంచారం.. తీవ్ర కలకలం రేపుతోంది. కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామ శివారులో చిరుత సంచరిస్తోంది. తెల్లవారుజామున రెండు ఆవుదూడలపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. గతంలోనూ ఇదే తరహా ఘటనలు జరగడంతో వరుస చిరుత దాడులతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. గతంలో చిరుత సంచారంపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధిత రైతు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే అటవీ‎శాఖ అధికారులు పులిని బంధించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories