Visakhapatnam: కళ్యాణ మండపంలో ప్రియుడి పెళ్లి.. బయట పెట్రోల్ బాటిల్ తో యువతి హల్ చల్..!

Visakhapatnam: విశాఖలోని షీలానగర్ కల్యాణ మండపం వద్ద ఓ యువతి ఆందోళన చేపట్టింది.

Arun Chilukuri
Updated on: 3 Dec 2022 7:45 PM IST
Loved Man Marries Another Girl in Visakhapatnam
X

Visakhapatnam: కళ్యాణ మండపంలో ప్రియుడి పెళ్లి.. బయట పెట్రోల్ బాటిల్ తో యువతి హల్ చల్..!

Visakhapatnam: విశాఖలోని షీలానగర్ కల్యాణ మండపం వద్ద ఓ యువతి ఆందోళన చేపట్టింది. తనను ప్రేమించి మోసం చేసిన యువకుడు వేరే పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకున్న యువతి పెట్రోల్‌తో హడావుడి చేసింది. ఆరు నెలల క్రితం తనను మోసం చేశాడంటూ దిశ పోలీసులకు ప్రియుడు భగత్‌పై ఫిర్యాదు చేసింది. అపట్లో భగత్‌పై కేసు నమోదు చేసి పోలీసులు రిమండ్‌కు తరలించారు. మూడు నెలల తరువాత జైలు నుంచి విడుదలైన భగత్‌ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story