Maha Shivaratri 2026 Live Updates: తెలుగు రాష్ట్రాల్లో శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

Maha Shivaratri 2026 Live Updates: తెలుగు రాష్ట్రాల్లో శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
x
Highlights

Maha Shivaratri 2026 Live Updates: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, ‘హర హర మహాదేవ.. శంభో శంకర’ అంటూ శివయ్య దర్శనానికి బారులు తీరారు.

Maha Shivaratri 2026 Live Updates: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, ‘హర హర మహాదేవ.. శంభో శంకర’ అంటూ శివయ్య దర్శనానికి బారులు తీరారు. ప్రధాన ఆలయాలైన శ్రీశైలం, వేములవాడ, శ్రీకాళహస్తిలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.




Show Full Article

Live Updates

  • 15 Feb 2026 8:18 AM GMT

    Maha Shivaratri 2026 Live Updates: కోటప్పకొండకు భక్తుల తాకిడి..బిందెతీర్థంతో త్రికోటేశ్వరుడికి అభిషేకాలు



  • 15 Feb 2026 8:16 AM GMT

    Maha Shivaratri 2026 Live Updates: కీసర గుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకలు

    ఈ నెల 13 నుండి 18 వరకు ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

    తెల్లవారు జాము నుంచే భారీగా ఆలయానికి తరలి వస్తున్న భక్తులు

    వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు

    మహా శివరాత్రి పర్వదినాన భోళా శంకరుని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయి అనే నమ్మకంతో భారీగా తరలి వస్తున్న భక్తులు

    సమయం గడుస్తున్న కొద్ది క్యూ లైన్లలో పెరుగుతున్న భక్తుల సంఖ్య

    తెల్లవారుజామునే ఆ మహా శివునికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించిన ఆలయ అర్చకులు

  • 15 Feb 2026 8:15 AM GMT

    Maha Shivaratri 2026 Live Updates: శ్రీ సత్య సాయి లేపాక్షి లో ఘనంగా శివరాత్రి వేడుకలు శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు

  • 15 Feb 2026 8:15 AM GMT

    Maha Shivaratri 2026 Live Updates: శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమవతి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా సిద్దేశ్వర స్వామి (శివుని ఆలయంలో) బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.

    ఈ హేమావతి ఆలయం ప్రత్యేకత ఏమంటే శివుడు లింగాకారంలో కాకుండా, మానవాకారంలో ఉండడం ఈ ఆలయ విశేషం.

    మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ శివున్ని దర్శించడానికి ఉదయాన్నే అంద్ర నుంచే కాకుండా కర్ణాటక నుండి భారీ గా తరలివచ్చారు భక్తులు.

    ఈ హేమావతి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 7 రోజులు జరుగుతాయి. అందులో భాగంగా నేడు రుద్రాభిషేకం, అఖండపూజలు నిర్వహించారు అర్చకులు.

  • 15 Feb 2026 8:14 AM GMT

    Maha Shivaratri 2026 Live Updates: మావన ఆకారంలో మహా శివుడు..భక్తులకు ప్రత్యేక దర్శనం




  • 15 Feb 2026 8:13 AM GMT

    Maha Shivaratri 2026 Live Updates: తూ.గో జిల్లాలో పుణ్య స్నానాలకు పోటెత్తిన భక్తులు




  • 15 Feb 2026 8:12 AM GMT

    Maha Shivaratri 2026 Live Updates: తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఘనంగా ప్రారంభమైన మహా శివరాత్రి వేడుకలు..

    తిమ్మమాంబ రథోత్సవం ప్రారంభించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్..

    గుస్సాడి నృత్యం, కూచిపూడి నాట్యం, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమైన ఉత్సవాలు

  • 15 Feb 2026 8:11 AM GMT

    Maha Shivaratri 2026 Live Updates: వేములవాడ రాజన్న కు రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్, 

    ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్

  • 15 Feb 2026 8:10 AM GMT

    Maha Shivaratri 2026 Live Updates: సంగారెడ్డి ఝారసంగం కేతకి సంగమేశ్వర ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా బారులు తీరిన భక్త్తులు.

  • 15 Feb 2026 8:10 AM GMT

    Maha Shivaratri 2026 Live Updates: కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో భక్తులు పోటెత్తారు.

    ఉదయం 2 గంటలనుండే భక్తుల తాకిడి మొదలైంది.

    వి.ఐ.పి లకు అధిక ప్రధాన్యత ఇస్తున్నారని సామాన్యల భక్తులు అందోలన

    ఉదయం 2 నుండి క్యూలైనలో ఉన్నామని కాని లైన్ కదలడం లేని అందోలన

    ఆలయ ఈఓ, చైర్మెన్ డౌన్ డౌన్ అని భక్తలు నినాదాలు

Print Article
Next Story
More Stories