RTC BUS: విశాఖ నుంచి జయపుర వెళ్తున్న ఆర్టీసీ బస్సు దగ్ధం

RTC BUS: విశాఖ నుంచి జయపుర వెళ్తున్న ఆర్టీసీ బస్సు దగ్ధం
x

RTC BUS: విశాఖ నుంచి జయపుర వెళ్తున్న ఆర్టీసీ బస్సు దగ్ధం

Highlights

RTC BUS: వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

RTC BUS: వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కర్నూలు బస్సు ప్రమాదం ఘటన మరువకముందే.. మన్యం జిల్లాలో మరో ఆర్టీసీ బస్సు మంటల్లో కాలిపోయిన ఘటన వెలుగుచూసింది. పాచిపెంట మండలం రొడ్డవలసలో ఆర్టీసీ బస్సు దగ్ధమైంది.

విశాఖపట్నం నుంచి జైపూర్‌కు వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు గుర్తించిన బస్సు డ్రైవర్‌ అప్రమత్తమై వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. అయితే మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories