AP Crime News: వదినపై మరిది ఉన్మాదం: నిద్రిస్తున్న సమయంలో లైంగిక దాడికి యత్నం.. విఫలమవడంతో యాసిడ్ పోసి హత్యాప్రయత్నం!

AP Crime News: వదినపై మరిది ఉన్మాదం: నిద్రిస్తున్న సమయంలో లైంగిక దాడికి యత్నం.. విఫలమవడంతో యాసిడ్ పోసి హత్యాప్రయత్నం!
AP Crime News: వరుసకు అమ్మతో సమానమైన వదినపై ఒక మరిది కనికరం లేకుండా ప్రవర్తించాడు.
AP Crime News: వరుసకు అమ్మతో సమానమైన వదినపై ఒక మరిది కనికరం లేకుండా ప్రవర్తించాడు. కామవాంఛ తీర్చాలని వేధించడమే కాకుండా, ఆమె నిరాకరించడంతో ఏకంగా యాసిడ్ పోసి చంపేందుకు ప్రయత్నించాడు. పల్నాడు జిల్లా రొంపిచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అమానుష ఘటన వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే..
రొంపిచర్ల మండలానికి చెందిన బాధితురాలి (34) భర్త ఏడాదిన్నర క్రితం మరణించాడు. అప్పటి నుంచి ఆమె కూలీ పనులకు వెళ్తూ తన ముగ్గురు పిల్లలను పోషించుకుంటోంది. అయితే, ఆమెపై ఆమె మరిది శామ్యూల్ కన్నేశాడు. గతంలోనే ఒకసారి ఆమెపై అత్యాచారయత్నం చేయగా, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. అప్పట్లో తప్పు ఒప్పుకుని, కాళ్లు పట్టుకుని బతిమలాడటంతో ఆమె వదిలేసింది.
యాసిడ్ దాడి నుంచి తృటిలో తప్పించుకుని..
పెద్దమనుషుల సాక్షిగా ఇచ్చిన మాటను పక్కన పెట్టిన శామ్యూల్, ఈ నెల 16న రాత్రి సమయంలో ఆమె నిద్రిస్తుండగా మరోసారి లైంగిక దాడికి ఒడిగట్టాడు. బాధితురాలు గట్టిగా ప్రతిఘటించడంతో ఆగ్రహం చెందిన నిందితుడు, వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను ఆమెపై పోసేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన ఆమె తృటిలో తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
పోలీసులకు ఫిర్యాదు:
బుధవారం తన బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న బాధితురాలు, శామ్యూల్ నుంచి తనకు మరియు తన పిల్లలకు ప్రాణహాని ఉందని వేడుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రొంపిచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు శామ్యూల్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



