పెళ్లి కోసం బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారా? జరభద్రం.. వరుడికి తెలియకుండా అద్దె యువతితో పెళ్లి చేసిన విజయవాడ బ్రోకర్లు

Marriage Scam Vijayawada Karnataka Youth Cheated
x

పెళ్లి కోసం బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారా? జరభద్రం.. వరుడికి తెలియకుండా అద్దె యువతితో పెళ్లి చేసిన విజయవాడ బ్రోకర్లు

Highlights

Marriage Scam: ఆమెకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలున్నారు. అయినా బ్రోకర్లు కర్ణాటకకు చెందిన యువకుడితో పెళ్లి చేశారు.

Marriage Scam: ఆమెకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలున్నారు. అయినా బ్రోకర్లు కర్ణాటకకు చెందిన యువకుడితో పెళ్లి చేశారు. ఈ పెళ్లి కోసం బ్రోకర్లు తెలివిగా వరుడి కుటుంబం నుంచి 4 లక్షలు తీసుకున్నారు. తీరా చూస్తే నాలుగు రోజులు గడిచిన తర్వాత తనకు పెళ్లియిందని, పిల్లలున్నారని వధువు చెప్పడంతో వరుడు షాక్‌కి గురయ్యాడు. ఇక చేసేది లేక వరుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

పెళ్లి అంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలను చూసి చేయాలని మన పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారు. కానీ ఈ మధ్య కాలం అలా కుదరడం లేదు. పైగా వయసు కాస్త ఎక్కువైతే ఎదురు డబ్బులు ఇచ్చి మరీ, ఎవరో ఒకరిని పెళ్లి చేసేసుకుంటున్నారు. ఒకవేళ అదృష్టం బావుంటే.. ఈ పెళ్లిళ్లు సక్సెస్. లేదంటే మూడునాళ్ల ముచ్చట్టే అవుతుంది. ఇదిగో ఈ కర్ణాటక కుర్రాడి పరిస్థితి కూడా అదే అయింది. పెళ్లై ఇద్దరు పిల్లలున్న మహిళను పెళ్లికాని యువతి అని చెప్పి కర్ణాటకకు చెందిన యువకుడికి ఇచ్చి బ్రోకర్లు పెళ్లి చేశారు.

కొన్ని రోజుల క్రితం కర్ణాటకకు చెందిన ఒక యువకుడి కుటుంబం స్థానిక పెద్దలతో కలిసి విజయవాడలో ఒక సంబంధం ఉందని మధ్యవర్తుల ద్వారా తెలుసుకుని వచ్చారు. పిల్లను చూశారు. పిల్ల నచ్చడంతో పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. విజయవాడలోనే పెళ్లి జరగాలని ఇటు పెళ్లికూతురు తరపు వాళ్లు, అలాగే మధ్యవర్తులు కూడా పట్టుబట్టారు. అలాగే యువతి తల్లిదండ్రుల వైద్యం నిమిత్తం వరుడి కుటుంబం బ్రోకర్లకు 2 లక్షల డబ్బు ఇచ్చారు. ఆ తర్వాత విజయవాడ దుర్గమ్మగుడిలో వీరి పెళ్లి జరిగింది. ఆ తర్వాత కర్ణాటకకు వెళ్లిపోయారు. అక్కడకు వెళ్లిన దగ్గర నుంచి పెళ్లికూతురు విచిత్రంగా వ్యవహరించడం వాళ్లకు అనుమానం వచ్చింది. ఆ తర్వాత ఆమెను గట్టిగా నిలదీస్తే తనకు పెళ్లి అయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని, తనని ఐదు రోజులు కాంట్రాక్ట్ కోసం మాట్లాడుకున్నారని, దీనికోసం తనకు 50 వేలు ఇస్తానని బ్రోకర్లు చెప్పారని అయితే నాకు 35వేలు ఇచ్చి 15వేలు బ్రోకర్లు కొట్టేసారని ఆమె చెప్పింది. జరిగిన మోసం తెలిసిన తర్వాత వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించారు.

కర్ణాటకలోని గంగావతిలో ఉన్న తెలుగు కుటుంబానికి చెందిన యువకుడు ఈ పెళ్లికొడుకు. ఇతనికి 34 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కుదరలేదు. దీంతో అతని తల్లిదండ్రులు బ్రోకర్లను ఆశ్రయించారు. మొదట శ్రీదేవి అనే ఆమెను కలిసారు. ఆమె ఆ తర్వాత విజయవాడకు చెందిన తాయారు అనే పెళ్లిళ్ల బ్రోకర్‌‌ని కలిపింది. ఆ తర్వాత తాయారుతో పాటు విమల, పార్వతి, ఆటో డ్రైవర్ అప్పారావులు కృష్ణలంకకు చెందిన ఒక యువతిని వీరికి చూపించారు.

అమ్మాయి కుటుంబ ఆర్ధిక పరిస్థితి సరిగా లేదంటూ పెళ్లికిముందే వారి దగ్గర నుండి 3.5 లక్షల రూపాయలు తీసుకున్నారు. పెళ్లి జరిగిన తర్వాత కర్ణాటకకు పెళ్లికూతురుతో పాటు తన అన్నయ్య కూడా వచ్చాడు. అయితే అక్కడ రిసెఫ్సన్ జరుగుతున్న సమయంలో పెళ్లికూతురు అన్నయ్య తన తల్లికి బాలేదని తక్షణమే బయలు దేరాలని చెప్పి మరో 50 వేలు తీసుకుని అక్కడ నుంచి పారిపోయాడు. ఆ తర్వాత పెళ్లి కూతురికి పెళ్లి జరగిందని, పిల్లలున్నారన్న విషయం తెలిసింది. తన పేరు పల్లవి కాదని, అసలు పేరు ఆమని అని చెప్పడంతో మోసపోయామని చాలా క్లియర్ గా స్పష్టమైంది. ఇక అప్పడు వరుడు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories