Tirumala: తిరుమల చేరుకున్న మారిషస్‌ ప్రధాని నవీన్‌ చంద్ర

Tirumala: తిరుమల చేరుకున్న మారిషస్‌ ప్రధాని నవీన్‌ చంద్ర
x
Highlights

Tirumala: భారత్ పర్యటనలో ఉన్న మారిషస్‌ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులాం సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు.

Tirumala: భారత్ పర్యటనలో ఉన్న మారిషస్‌ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులాం సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు పద్మావతి అతిథిగృహం వద్ద తితిదే అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని నవీన్‌చంద్ర తన సతీమణితో కలిసి కలియుగ దైవం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ఈ నెల 9న భారత్ వచ్చిన మారిషస్ ప్రధాని, సెప్టెంబర్ 11న ప్రధాని నరేంద్ర మోదీతో వారణాసిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారతీయులు ఎక్కువగా నివసించే మారిషస్‌కు భారత్ రూ.5,984 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. దీంతో పాటు తీరప్రాంత భద్రతతో సహా ఏడు కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులాం పర్యటన ఈ నెల 16తో ముగియనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories