మెగా డీఎస్సీ తుది జాబితా విడుదల – 16,347 ఉపాధ్యాయ నియామకాలు పూర్తి

మెగా డీఎస్సీ తుది జాబితా విడుదల – 16,347 ఉపాధ్యాయ నియామకాలు పూర్తి
x

మెగా డీఎస్సీ తుది జాబితా విడుదల – 16,347 ఉపాధ్యాయ నియామకాలు పూర్తి

Highlights

మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా విడుదల ఎక్స్‌లో డీఎస్సీ జాబితా విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ డీఎస్సి ఫైల్ పై మొదటి సంతకం చేసిన ఎంపీ సీఎ చంద్రబాబు 16,347 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి 150 రోజుల్లోనే విద్యా శాఖ డీఎస్సి పూర్తి చేసింది.

అమరావతిః మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేశారు. మెగా డీఎస్సీ హామీని నెరవేర్చాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్ పై తన మొదటి సంతకం చేశారు. 150 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ విజయవంతంగా మెగా డీఎస్సీ-2025ను పూర్తిచేసింది. ఫైనల్ లిస్ట్ సెలెక్షన్ లో ఉన్న విజయవంతమైన అభ్యర్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా ఈ రోజు ఉదయం 9.30 నుంచి అధికారిక వెబ్ సైట్ www.apdsc.apcfss.in. ద్వారా అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ మైలురాయి.. బాధ్యత, సేవతో కూడిన ఉపాధ్యాయ వృత్తి ఆరంభానికి సంకేతం.

చిన్నారుల మేధస్సును తీర్చిదిద్దుతూ, మన విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ AP మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను ప్రతి తరగతి గదికి చేర్చే దిశగా మీరు ముందుకు సాగబోతున్నారు. నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులను ఆత్మీయంగా ఆహ్వానించి, వారికి మార్గనిర్దేశం చేయాలని ఉపాధ్యాయ వర్గానికి పిలుపు ఇస్తున్నాను. ఈ అవకాశం అందుకోలేకపోయిన వారు నిరుత్సాహ పడొద్దు. ఇచ్చిన హామీ ప్రకారం, ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహించడం జరుగుతుంది. మీరంతా పట్టుదలతో సిద్ధం అవుతూ ఉండండి. అవకాశం తప్పకుండా వస్తుందని మంత్రి తెలిపారు...

Show Full Article
Print Article
Next Story
More Stories