Nara Lokesh: లడ్డూ కల్తీకి సంబంధించి వాస్తవాలన్నీ అసెంబ్లీలో పెడతాం

Nara Lokesh: లడ్డూ కల్తీకి సంబంధించి వాస్తవాలన్నీ అసెంబ్లీలో పెడతాం
x

Nara Lokesh: లడ్డూ కల్తీకి సంబంధించి వాస్తవాలన్నీ అసెంబ్లీలో పెడతాం

Highlights

Nara Lokesh: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన మహాపచారాన్ని ఆధారాలతో సహా అసెంబ్లీ వేదికగా బయటపెడతామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

Nara Lokesh: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన మహాపచారాన్ని ఆధారాలతో సహా అసెంబ్లీ వేదికగా బయటపెడతామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

సభకు రావడం సభ్యుల బాధ్యత:

వైసీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కావడంపై లోకేష్ స్పందిస్తూ.. "అసెంబ్లీకి రమ్మని ఎవరికీ బొట్టుపెట్టి పిలవరు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించడం వారి బాధ్యత" అని హితవు పలికారు. సభా మర్యాదలను పాటించకుండా బయట రాజకీయాలు చేయడం సరికాదన్నారు.

దేవుడిని రోడ్డు మీదకు తెచ్చారు:

వైసీపీ ఆందోళనలపై మండిపడుతూ.. "దేవదేవుడైన వేంకటేశ్వరస్వామిని కూడా వైసీపీ నేతలు రోడ్డు మీదకు తీసుకురావడం అత్యంత బాధాకరం. చట్టసభల ప్రాంగణంలో దేవుడి ఫొటోలతో ర్యాలీలు చేయడం ఆక్షేపణీయం" అని లోకేష్ పేర్కొన్నారు. భక్తిని రాజకీయాలకు వాడుకోవడం వైసీపీ అరాచక పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు.

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై రేపు అసెంబ్లీలో సమగ్ర చర్చ జరుగుతుందని, ఆ సమయంలో అన్ని వాస్తవాలను ప్రభుత్వం తరపున సభ ముందు ఉంచుతామని ఆయన వెల్లడించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories