మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి సవాల్ విసిరిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి సవాల్ విసిరిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
x
Highlights

వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి విరుచుకుపడ్డారు.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి విరుచుకుపడ్డారు. రాయచోటి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఏ విధమైన అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. రాయచోటి ప్రజలు శ్రీకాంత్ రెడ్డిని వేల మెజారిటీతో గెలిపిస్తే జిల్లాకు ఏమి చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భౌగోళికంగా రాయచోటి ప్రాంతం మధ్య ప్రాంతం కావడంతో జిల్లా కేంద్రంగా ప్రకటించడం జరిగిందని, జిల్లా కేంద్ర సహకారానికి శ్రీకాంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని మంత్రి తెలిపారు. పేదలకు అందాల్సిన ప్రభుత్వ భూములను ఫ్రీ హోల్డ్ పేరుతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి కలిసి మీ పేర్ల పై మార్చుకోలేదా ? అని మంత్రి ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories