Nandyala: కత్తి పట్టిన వాడు కత్తికే బలి

Nandyala: కత్తి పట్టిన వాడు కత్తికే బలి
x

Nandyala: కత్తి పట్టిన వాడు కత్తికే బలి

Highlights

నంద్యాలలో ఆ రౌడీ షీటర్లు ఇద్దరూ రాక్షసుల కంటే డేంజర్.. ఓ హెడ్ కానిస్టేబుల్ ను కిడ్నాప్ చేసి, కొట్టి, కత్తులతో దారుణంగా హత్య చేసి పోలీసులకే సవాల్ విసిరారు..

నంద్యాలలో ఆ రౌడీ షీటర్లు ఇద్దరూ రాక్షసుల కంటే డేంజర్.. ఓ హెడ్ కానిస్టేబుల్ ను కిడ్నాప్ చేసి, కొట్టి, కత్తులతో దారుణంగా హత్య చేసి పోలీసులకే సవాల్ విసిరారు.. వీరి జీవితమంతా నేరాలే.. దందా, సెటిల్మెంట్లు. కానీ కత్తి పట్టిన వాడు కత్తికే బలవుతాడాని రుజువైంది.. ఒక రౌడీ షీటర్ ప్రత్యర్ధుల చేతిలో బలయ్యాడు.. మరో రౌడీ షీటర్ మైనర్ బాలిక అత్యాచారం కేసులో 20 ఏళ్లు జైలు శిక్ష పడి, కటకలపాలయ్యాడు.


నంద్యాలలో రౌడీ షీటర్ మారిన రాజశేఖర్ ఇతని స్వస్థలం హైదరాబాద్ లోని కాచిగూడ.. నంద్యాలకు వలస వచ్చి రోజాకుంట ప్రాంతంలో ఉండేవాడు. శ్రీనివాస నగర్ ప్రాంతంలో ఫోటోగ్రాఫర్, రౌడీ షీటర్ జెమిని రఘు వద్ద అసిస్టెంట్ గా చేరి పెళ్లిళ్లకు, శుభకార్యాలకు ఫోటో వీడియోలు తీయడానికి వెళ్లేవాడు రాజశేఖర్. పదేళ్ల క్రితం శ్రీనివాస్ నగర్ లో రౌడీ షీటర్లు బుక్కాపురం శివ, బాలాంజనేయులను జెమినీ బ్యాచ్ కత్తులతో పొడిచి హత్య చేసింది. ఇందులో రఘుతో పాటు రాజశేఖర్, వెంకట్ సాయిలు ఉన్నట్లు కేసు నమోదైంది. తర్వాత ఏడాదిన్నరకు జెమినీ రఘు హత్యకు గురయ్యాడు. తర్వాత వెంకట సాయి, రాజశేఖర్ దందా మొదలైంది. ఇద్దరు కలసి హత్యలకు దందాలు, బెదిరింపులకు పాల్పడేవారు.


దందా చేసే క్రమంలో వెంకట సాయి, రాజశేఖర్ లకు మరో రౌడీ షీటర్ సంజీవ్ తో పరిచయం ఏర్పడింది. నాలుగేళ్ల క్రితం ఎన్టీవో ముగ్గురు కలిసి మరో రౌడీషీటర్‌ను రాజశేఖర్ హత్య చేశాడు. ఈ హత్య సుపారీ విషయంలో సంజీవ్ తో , రాజశేఖర్ ల మధ్య విభేదాలు వచ్చాయి. వీరు వేరువేరు గ్రూపులుగా చలామణి అవుతూ దందా చేసేవారు. మూడేళ్ల క్రితం పద్మావతి నగర్ ఆర్చ్ సమీపములోని ఓ షాప్‌లో మద్యం తాగుతూ అల్లరి చేస్తున్న వెంకట సాయి, రాజశేఖర్ లను మందలించినందుకు హెడ్ కానిస్టేబుల్ సురేంద్రనాథ్‌ను, ఆటోలో కిడ్నప్ చేసి, మహానంది రాస్తాలోకి తీసు్కువెళ్లి, కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.


పోలీస్ వ్యవస్థనే సవాల్ చేసే ఈ సంఘటన రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించింది. హెడ్ కానిస్టేబుల్ సురేంద్ర హత్య తర్వాత వెంకట సాయి, మరి కొందరు అరెస్ట్ కాగా, రాజశేఖర్ పరారయ్యాడు. రెండేళ్లు పోలీసులకు చిక్కకుండా చుక్కలు చూపాడు రాజశేఖర్. రెండేళ్ల తర్వాత , పోలీసులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. జైలు నుంచి బయటకు వచ్చాక, వెంకట సాయి మళ్లి దందాను ప్రారంభించారు. ఏకంగా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే అఖిల ప్రియ ప్రధాన అనుచరుడి పై హత్యాయత్నం కేసులో వెంకట సాయి నిందితుడు ఉన్నాడు.


కత్తి పట్టినవాడు కత్తికె బలవుతాడనట్లు రౌడీ షీటర్ వెంకట సాయి దారుణ హత్యకు గురయ్యాడు. అయ్యలూరు ప్రాంతంలోని ఓ వెంచర్ లో స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా, ప్రత్యర్థులు దాడి చేసి కత్తులతో పొడిచి హత్య చేశారు. మరోవైపు రౌడీ షీటర్ రాజశేఖర్ ఓ మైనర్ బాలికను ప్రేమ పేరిట వంచించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఫోక్సో కేసులో అతనికి కోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధించడంతో పోలీసులు కడప సెంట్రల్ జైలు తరలించారు. మరో ఫోక్సో కేసు కూడా విచారణలో ఉంది. సురేంద్ర హత్యకు పాల్పడ్డ ప్రధాన నిందితులు వెంకట సాయి , రాజశేఖర్ జీవితం ముగిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories