Nara Lokesh Birthday: లోకేశ్‌కు బ్రాహ్మణి బర్త్‌డే విషెస్.. "నీ పక్కన నడవడానికి గర్వపడతాను".. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్!

Nara Lokesh Birthday
x

Nara Lokesh Birthday: లోకేశ్‌కు బ్రాహ్మణి బర్త్‌డే విషెస్.. "నీ పక్కన నడవడానికి గర్వపడతాను".. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్!

Highlights

Nara Lokesh Birthday: నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా భార్య బ్రాహ్మణి భావోద్వేగ పోస్ట్! "నువ్వే నా బలం.. నా ప్రశాంతత" అంటూ తన భర్త త్యాగాలను ఉద్దేశించి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Nara Lokesh Birthday: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు (జనవరి 23) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అత్యంత భావోద్వేగభరితమైన శుభాకాంక్షలు తెలిపారు.

నా బలం.. నా ప్రశాంతత నీవే!

లోకేశ్ పడుతున్న శ్రమను, ప్రజల కోసం చేస్తున్న త్యాగాలను గుర్తుచేస్తూ బ్రాహ్మణి ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. "నా బలం, నా ప్రశాంతత అయిన లోకేశ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు నిశ్శబ్దంగా మోస్తున్న భారాన్ని, మార్పు కోసం మీరు చూపిస్తున్న నిబద్ధతను నేను నిరంతరం గమనిస్తున్నాను. అది మా అందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఈ హడావుడి జీవితంలో ఈ ఏడాది మీకు కాస్త ప్రశాంతత లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పక్కన నడవడానికి నేను ఎప్పుడూ గర్వపడతాను" అంటూ ఆమె రాసుకొచ్చారు. భర్తపై ఆమె చూపిన ఈ అనురాగం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.



శుభాకాంక్షలు తెలిపిన బాలకృష్ణ..

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తన అల్లుడికి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. ప్రజాసేవలో లోకేశ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

సోషల్ మీడియాలో 'లోకేశ్ బర్త్‌డే' ట్రెండింగ్..

నారా లోకేశ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏపీ వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పండుగలా నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు పెద్ద ఎత్తున 'హ్యాపీ బర్త్‌డే లోకేశ్ అన్నా' అంటూ విషెస్ తెలుపుతుండటంతో హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. పలుచోట్ల సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories