Nara Lokesh: టీడీపీ నేతలకు లోకేష్ కొత్త ఫార్ములా.. ఏంటా 'ABC'?

Nara Lokesh: అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ ముచ్చటించారు. రాజకీయ నేతలకు 'ABC' ఫార్ములాను సూచించడంతో పాటు, బ్లూ జెట్ పరిశ్రమ పెట్టుబడులు మరియు తన వెయిట్ లాస్ జర్నీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో సరదాగా ముచ్చటించారు. కేవలం సాంకేతికత మాత్రమే కాదు, రాజకీయాల్లో మానవీయ సంబంధాలు ఎంత ముఖ్యమో ఆయన వివరించారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత మార్పులు, పార్టీ శ్రేణులకు ఆయన ఇచ్చిన సరికొత్త ఫార్ములా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
లోకేష్ 'ABC' ఫార్ములా:
పార్టీ నేతలందరూ నిత్యం ప్రజల్లో ఉండాలని సూచిస్తూ లోకేష్ 'ABC' (Always Be Campaign) ఫార్ములాను తెరపైకి తెచ్చారు. "రాజకీయాల్లో సిద్ధాంతాలు ఎంత ముఖ్యమో, నేతలతో హ్యూమన్ టచ్ కూడా అంతే అవసరం. ఈ విషయాన్ని నేను స్వయంగా ప్రధాని మోదీ గారి నుంచే నేర్చుకున్నాను. ఆయన ఎంత బిజీగా ఉన్నా నేతల వ్యక్తిగత బాగోగులను స్వయంగా ఫోన్ చేసి అడుగుతారు" అని లోకేష్ పేర్కొన్నారు.
"క్వాంటం కంప్యూటింగ్, ఏఐ వంటి అంశాలను చంద్రబాబు గారు చూసుకుంటారు.. నేను మాత్రం మానవీయ సంబంధాలపై దృష్టి పెట్టాను. యువగళం పాదయాత్ర సమయంలో నేతలతో గడిపిన ఆత్మీయ సమయమే ఈ నిర్ణయానికి కారణం" అని వెల్లడించారు.
ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులతో బంధం బలోపేతం చేయడం కోసమే ప్రతీ ఏటా బడ్జెట్ సమావేశాల సమయంలో డిన్నర్ భేటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 28న యలమంచిలిలో రూ. 2,300 కోట్ల పెట్టుబడితో రానున్న 'బ్లూ జెట్' పరిశ్రమకు శంకుస్థాపన చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు."నేను ఇంకా బరువు తగ్గుతున్నానని అంతా అంటున్నారు. మరో 2 కిలోలు తగ్గితే నా లక్ష్యం పూర్తవుతుంది" అని సరదాగా వ్యాఖ్యానించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



