Nellore Floods: ఉమ్మడి నెల్లూరులో క్లౌడ్ బరస్ట్ బీభత్సం.. చెన్నై, తిరుపతి మార్గాల్లో కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

Nellore Floods: ఉమ్మడి నెల్లూరులో క్లౌడ్ బరస్ట్ బీభత్సం.. చెన్నై, తిరుపతి మార్గాల్లో కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
x

Nellore Floods: ఉమ్మడి నెల్లూరులో క్లౌడ్ బరస్ట్ బీభత్సం.. చెన్నై, తిరుపతి మార్గాల్లో కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

Highlights

Nellore Floods: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్లౌడ్ బరస్ట్‌ను తలపించేలా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Nellore Floods: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్లౌడ్ బరస్ట్‌ను తలపించేలా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లా తీర ప్రాంతం వరద గుప్పెట్లో చిక్కుకుంది. కోస్తాలోని కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో నెల్లూరు, చెన్నై, తిరుపతి మార్గాల వైపు వెళ్లే వాహనరాకపోకలు కిలోమీటర్ల మెర నిలిచిపోయాయి.

ఉమ్మడి నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు లేనంతగా సుమారు 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. భారీ వర్షాలతో ఎక్కడికక్కడ కాలువలు డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన రహదారులు.. నదులను తలపిస్తున్నాయి. పాఠశాల ప్రాంగణాలు నీట మునిగాయి. నెల్లూరు నగరంలోని వన్ టౌన్, టూ టౌన్ మధ్య రాకపోకలు స్థంభించాయి. ఈ మార్గంలో ఉన్న విజయమహల్ గేట్, రామలింగాపురం, మాగుంట లేఔట్ అండర్పాస్ లు పూర్తిగా నీట మునిగిపోయాయి. భారీ వర్షాలతో నగరవాసులు కలవరపాటుకు గురవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories