Petrol Pump Scam: రూ.400ల పెట్రోల్ కొట్టించుకున్న యువకుడు..కానీ బండిలోకి పెట్రోల్ రాలేదు..ఆ తర్వాత ఏం జరిగింది?

Petrol Pump Scam: రూ.400ల పెట్రోల్ కొట్టించుకున్న యువకుడు..కానీ బండిలోకి పెట్రోల్ రాలేదు..ఆ తర్వాత ఏం జరిగింది?
x

Petrol Pump Scam: రూ.400ల పెట్రోల్ కొట్టించుకున్న యువకుడు..కానీ బండిలోకి పెట్రోల్ రాలేదు..ఆ తర్వాత ఏం జరిగింది?

Highlights

Petrol Pump Scam: ఈ మధ్య కాలంలో పెట్రోల్ బంక్‌లో జరుగుతున్న మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

Petrol Pump Scam: ఈ మధ్య కాలంలో పెట్రోల్ బంక్‌లో జరుగుతున్న మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నెల్లూరులో ఒక ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి పెట్రోల్ బంక్‌కు వెళ్లి రూ.400 ల పెట్రోల్ కొట్టించుకున్నాడు. కట్ చేస్తే బండిలోకి పెట్రోల్ అంత రాలేదు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

ఇందునా..అందునా అని కాదు..ఇప్పుడు ఎక్కడ చూసినా మోసమే. మోసంతోనే సమాజం నడిస్తోంది. రోజురోజుకూ మోసాలు చేసేవాళ్ల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా ఇలాంటి ఒక సంఘటన నెల్లూరిలోని ఒక పెట్రోల్ బంక్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే...

ఈ మధ్యకాలంలో పెట్రోల్ బంకుల్లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏమాత్రం ఏమరుపాటుతో ఉన్నామో జేబుకు చిల్లు పెట్టేందుకు పెట్రోల్ బంకుల నిర్వాహకులు సిద్దంగా ఉంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నెల్లూరులో జరిగింది. నెల్లూరిలోని బుచ్చిరెడ్డిపాలెంలోని ఒక పెట్రోల్ బంక్‌కు వెళ్లిన ఒక యువకుడు రూ.400 పెట్రలో తన బైక్‌లో వేయించుకున్నాడు. డబ్బులు కూడా చెల్లించాడు. తీరా మీటర్ చెక్ చేయడంతో పెట్రోల్ లీటర్ కూడా రాలేదు.

ఈ సంఘటన జరిగిన వెంటనే వాహనదారుడు పెట్రోలు వేసిన వ్యక్తిని ఇదేంటని అడిగితే.. సమాధానం దాటవేశాడు. అసలు పొంతన లేని సమాధానాలు చెప్పాడు. ఎక్కడ చెప్పుకుంటావో అక్కడ చెప్పుకో..పో అంటూ మాట్లాడాడు.

ఇలాంటి సంఘటనే తెలుగు రాష్ట్రాల్లో తరచూ జరుగుతున్నాయి. మీటర్ చిప్‌లు పెట్టి వాహనదారుల జేబులు గుల్ల చేస్తున్నారు. పెట్రోల్ ఎంత వేస్తున్నారు.. దానికి ఎంత డబ్బులు అవుతున్నాయన్నది పెట్రోల్ బంక్‌లోని మీటర్ క్లారిటీగా చూపిస్తుంది. నిజంగా ఒక నాలుగు లీటరు బండిలో వేయాలంటే ఎంత సమయం పడుతుందో అంత సమయం కూడా పెట్రోల్ వేస్తున్నంటే ఉంటారు. కానీ తీరా చూస్తే పెట్రోల్ తక్కువగా వస్తుంది. ఒక లీటరు కొట్టి నాలుగు లీటర్లకు డబ్బులు తీసుకోవచ్చు. అధికారులు పర్యవేక్షణ కరువవ్వడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories