Nirmala Sitharaman: జీఎస్టీతో రూ.22 లక్షల కోట్ల ఆదాయం

Nirmala Sitharaman: జీఎస్టీతో రూ.22 లక్షల కోట్ల ఆదాయం
x
Highlights

Nirmala Sitharaman: 2017కి ముందు దేశంలో 17 రకాల పన్నులు, వాటిపై 8 సెస్సులు ఉండేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

Nirmala Sitharaman: 2017కి ముందు దేశంలో 17 రకాల పన్నులు, వాటిపై 8 సెస్సులు ఉండేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విశాఖపట్నంలోని మధురవాడలో జరిగిన జీఎస్టీ సంస్కరణల సమావేశంలో ఆమె ఈ విషయాలు చెప్పారు.

2017కి ముందు కేవలం 65 లక్షల మంది మాత్రమే పన్ను చెల్లింపుదారులు ఉండేవారని, జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రాల సహకారంతో ఈ సంఖ్య 1.51 కోట్లకు పెరిగిందని ఆమె వివరించారు. జీఎస్టీ అమలు తర్వాత ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. 2018లో జీఎస్టీ ద్వారా రూ.7.19 లక్షల కోట్ల ఆదాయం రాగా, 2025 నాటికి అది రూ.22.08 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించారు.

140 కోట్ల మంది ప్రజలకు వర్తించే జీఎస్టీపై కేంద్రం ఒక పెద్ద నిర్ణయం తీసుకుందని, దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెరిగిందని సీతారామన్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో, పన్నుల వ్యవస్థను సరళీకృతం చేయడంలో జీఎస్టీ కీలక పాత్ర పోషించిందని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. ఈ సంస్కరణ దేశ ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని ఆమె నొక్కి చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories