Chandrababu: కృష్ణనదీ జలాలపై హక్కును వదులుకోం

Chandrababu: కృష్ణనదీ జలాలపై హక్కును వదులుకోం
x

Chandrababu: కృష్ణనదీ జలాలపై హక్కును వదులుకోం

Highlights

Chandrababu: కృష్ణా నదీ జలాల విషయంలో తమ రాష్ట్రం వాటాలపై తగ్గేదేలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Chandrababu: కృష్ణా నదీ జలాల విషయంలో తమ రాష్ట్రం వాటాలపై తగ్గేదేలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కృష్ణాజలాల వాటా కేటాయింపులపై పునఃసమీక్షకు ఒప్పుకునేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు జలవనరుల శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు నేడు కీలక దిశానిర్దేశం చేశారు.

జలవనరుల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, "కృష్ణా నదీ జలాలపై ఉన్న హక్కును ఏ మాత్రం వదులుకోబోం" అని పునరుద్ఘాటించారు. అంతర్రాష్ట్ర జలవివాదాలు, వాటాల కేటాయింపుల విషయంలో రాష్ట్రం తరపున బలమైన, సమగ్రమైన వాదనలను సమర్థవంతంగా వినిపించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories