TTD Jobs: గుడ్ న్యూస్..టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..జీతం నెలకు రూ. 2లక్షలు

Notification for contract jobs in TTD is full details
x

TTD Jobs: గుడ్ న్యూస్..టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..జీతం నెలకు రూ. 2లక్షలు

Highlights

TTD Jobs: తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎంఎల్ సీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తుల చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

TTD Jobs: తిరుపతిలో శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఉద్యోగ ప్రకటన రిలీజ్ చేసింది. ఈ ప్రకటన ద్వారా టిటిడిలో రెండేండ్ల కాంట్రాక్ట్ బేస్డ్ మిడిల్ లెవెల్ కన్సల్టెంట్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లయ్ చేసుకోవల్సిందిగా కోరుతోంది. ఏపీ నుంచి హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 8 దరఖాస్తులు చేసుకునేందుకు చివరి తేదీ.

ఎంబీఏ ఉత్తీర్ణతతోపాటు జనరల్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఆఫీస్ మేనేజ్ మెంట్ లేదా రిలీజియస్ ఆర్గనైజేషన్ విభాగాల్లో పదేండ్ల నుంచి 15ఏండ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. ఐటీ, అనలిటికల్, కమ్యూనికేషన్ వంటి విభాగాల్లో నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలి. వయస్సు 45ఏండ్లకు మించి ఉండకూడదు. నెలకు రూ. 2లక్షలతోపాటు అవసరమైన వసతి, ల్యాప్ టాప్ సౌకర్యం కల్పిస్తారు. ఎంపిక ప్రక్రియ అనేది రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

తిరుపతి లేదా తిరుమలలో పనిచేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు దరఖాస్తులను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్, పాత అలిపిరి గెస్ట్ హౌస్ తిరుపతి చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. లేదంటే [email protected] ఈ మెయిల్ దరఖాస్తులు మెయిల్ చేయాలి. అక్టోబర్ 7 అప్లికేషన్స్ తీసుకునేందుకు చివరి తేదీ.

Show Full Article
Print Article
Next Story
More Stories