Pension Scheme: ఏపీలో పెన్షన్ దారులకు బిగ్ షాక్..వారందరి పింఛన్లు కట్..ఎంత మందికో తెలుసా?

Pension
x

Pension

Highlights

Pension Scheme: ఏపీలోని కూటమి సర్కార్ పెన్షన్ దారులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా స్కీము కింద పింఛన్లకు సంబంధించి ఇటీవల తనిఖీలు...

Pension Scheme: ఏపీలోని కూటమి సర్కార్ పెన్షన్ దారులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా స్కీము కింద పింఛన్లకు సంబంధించి ఇటీవల తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. అనర్హులు పింఛన్లు తీసుకొంటున్నారనే ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ తీసుకుంటున్న వారిలో అనర్హుల్ని గుర్తించేందుకు ఈ ప్రక్రియ చేపట్టింది. అర్హులకు మాత్రమే పింఛన్ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నెలకు రూ. 15వేలు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ పొందేవారిలో అనర్హుల గుర్తింపు పూర్తి చేసింది. రూ. 15వేలు పింఛన్ తీసుకుంటున్నవారిలో 24091 మందిలో 7256 మంది అంటే దాదాపు 30శాతం మంది పూర్తిగా అనర్హులని తేలినట్లు సమాచారం. మిగిలిన వారిలోనూ 9,296 మంది మాత్రమే రూ. 6వేల పింఛన్ కు మాత్రమే అర్హులని తేలినట్లు తెలుస్తోంది.

కాగా గత ప్రభుత్వ హయాంలో కొంతమంది డాక్టర్లు, మధ్యవర్తులు కుమ్మక్కై ఇష్టారీతిన దివ్యాంగులకు అందించే ధ్రువపత్రాలు ఇచ్చినట్లు ఫిర్యాదులు అందాయి. అలాగే నిర్ధారణ కూడా అయ్యిందంటున్నారు. ఈ క్రమంలో గత మూడు, నాలుగు నెలలుగా దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ అందుకుంటున్న ప్రతి లబ్దిదారు ఇంటికి మెడికల్ టీమ్స్ ను నేరుగా వెళ్లి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేసిన విషయం తెలిసిందే. దివ్యాంగుల కేటగిరీలో మంచానికి పరిమితమైన పక్షవాత రోగులు, ప్రమాద బాధితులు, తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రభుత్వం ప్రతినెలా రూ. 15వేల పింఛన్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది వాళ్లు, చేతుల్లో వంకర్లు, వినికిడి లోపం, అంధత్వం వంటి వైకల్య సమస్యలు తీవ్ర స్థాయిలో లేకపోయినా ఆ లోపాలు ఉన్నట్లు గత ప్రభుత్వ హయాంలో డాక్టర్ల ద్వారా ధ్రువీకరణ పత్రాలు పొందినట్లు గుర్తించారు.

ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ లబ్దిదారుల ఇళ్లకు మెడికల్ టీమ్స్ ను పంపించి తనిఖీలు నిర్వహించారు. కొంతమంది లబ్దిదారులు 85శాతం వైకల్యం లేకపోయినా సరే ఆ టీమ్స్ ఇళ్లకు తనిఖీల కోసం వచ్చిన సమయంలో వైకల్యం ఉన్నట్లు నటించినట్లు తెలుస్తోంది. ఈ పరీక్షల్లో నిజాలు తేలడంతో అనర్హుల్ని గుర్తించారు దివ్యాంగుల కేటగిరిలో నెలకురూ. 6వేల పింఛన్ పొందుతున్న 7.790లక్షల మంది దివ్యాగగులను మరోసారి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచినట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు 40వేల మంది అనర్హులని తేలింది. దొంగ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో ఈ ధ్రువ పత్రాలతోనే అనర్హులు అధిక పింఛన్ పొందుతున్నట్లు తేలింది. మొత్తానికి అర్హత లేకున్నా పింఛన్ తీసుకుంటున్న వారిని ప్రభుత్వం గుర్తించింది. దీంతో వారికి పింఛన్ కట్ చేసేందుకు సిద్ధమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories