NTR Vaidya Seva: నేటి నుంచి ఏపీలో ఎన్టీఆర్‌ వైద్య సేవలు బంద్

NTR Vaidya Seva: నేటి నుంచి ఏపీలో ఎన్టీఆర్‌ వైద్య సేవలు బంద్
x

NTR Vaidya Seva: నేటి నుంచి ఏపీలో ఎన్టీఆర్‌ వైద్య సేవలు బంద్ 

Highlights

ఆంధ్రప్రదేశ్‌లో పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ఉద్దేశించిన డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) సేవలు నేటి నుంచి నిలిచిపోయాయి.

NTR Vaidya Seva Services Halted in AP from Today: ఆంధ్రప్రదేశ్‌లో పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ఉద్దేశించిన డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) సేవలు నేటి నుంచి నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వానికి, నెట్‌వర్క్ ఆస్పత్రుల మధ్య బకాయిల చెల్లింపు విషయంలో నెలకొన్న వివాదం కారణంగా ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ASHA) తీసుకున్న నిర్ణయం మేరకు, నెట్‌వర్క్ ఆస్పత్రులు నేటి నుంచి ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్ కింద అందించే ఎమర్జెన్సీ సహా అన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.

బకాయిలు చెల్లించాలని డిమాండ్:

నెట్‌వర్క్ ఆస్పత్రులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. బకాయిలు పేరుకుపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు, ఇంప్లాంట్స్ కొనుగోలు వంటివి భారంగా మారాయని, ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద సేవలను కొనసాగించడం అసాధ్యమని అసోసియేషన్ స్పష్టం చేసింది.

నెట్‌వర్క్ ఆస్పత్రుల ఈ నిర్ణయంతో వేలాది మంది పేద రోగులు ఉచిత వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేసి, పేదలకు వైద్య సేవలు పునరుద్ధరణ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories