Andhra Pradesh: సీఎం జగన్ పుట్టిన రోజుకు ఓ అవ్వ అపురూప కానుక

ప్రభుత్వాసుపత్రి నిర్మాణానికి ఎకరం పొలం ఉచితంగా ఇచ్చిన సీతమ్మ ఎకరం పొలం విలువ దాదాపు మూడు కోట్లు

Sandeep Reddy
Updated on: 24 Dec 2021 8:30 PM IST
on the Occasion of AP YS Jagan Birthday an Old Woman Donated One Acre Land for Govt Hospital Construction
X

ప్రభుత్వాసుపత్రి నిర్మాణానికి ఎకరం పొలం ఉచితంగా ఇచ్చిన సీతమ్మ

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ జన్మదినం సందర్భంగా ఓ అవ్వ తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంది. ఏదో ఒక మంచి పని చేయాలన్న భర్త ఉద్దేశాలను అర్ధం చేసుకుంది..పుట్టెడు ఆస్తులున్నా పిల్లలు లేకపోవడంతో ఆ ఆస్తిని సమాజానికి ఉపయోగించి ఓ మంచి పని చేయాలని తపించింది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామానికి చెందిన బూరుగుపల్లి సీతమ్మ తమ ప్రియతమ నాయకుడి జన్మదినానికి ఏదో ఒక కానుక ఇవ్వాలనుకుంది.

గతించిన తన భర్త ఆశయాలకోసం ఏదైనా మంచి పని చేయాలనుకుంది.. పిల్లలు లేని కారణంగా తన ఆస్తిని చెల్లెలి పిల్లలకు రాసేసిన సీతమ్మ.. జగన్ జన్మదినం సందర్భంగా తన మనసు మార్చుకుంది. చెల్లెలు మనవడికి రాసిన ఆస్తిని తిరిగి వెనక్కి రాయించుకుని ప్రభుత్వాసుపత్రికి విరాళంగా ఇచ్చింది. భర్త సుబ్బారావు జ్ఞాపకార్ధం మూడు కోట్ల విలువ చేసే ఆ భూమిలో ప్రభుత్వాసుపత్రి నిర్మించాలని కోరింది. సీఎం పుట్టిన రోజు కానుకగా తానీ విరాళాన్ని ప్రకటించానన్న సీతమ్మ ఆశయాన్ని గ్రామ ప్రజలు అభినందించారు. జడ్పిటిసి నందిగం భాస్కర్ రామయ్య వైయస్సార్ సిపి నాయకులు సీతమ్మ ను అభినందించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story