Padma Awards Telugu Winners 2026 List: పద్మ పురస్కారాల్లో మెరిసిన తెలుగు తేజాలు.. రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్‌లకు పద్మశ్రీ.. నోరి దత్తాత్రేయుడుకి పద్మభూషణ్!

Padma Awards Telugu Winners 2026 List
x

Padma Awards Telugu Winners 2026 List: పద్మ పురస్కారాల్లో మెరిసిన తెలుగు తేజాలు.. రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్‌లకు పద్మశ్రీ.. నోరి దత్తాత్రేయుడుకి పద్మభూషణ్!

Highlights

Padma Awards Telugu Winners 2026 List: 2026 పద్మ పురస్కారాల ప్రకటన: రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్ సహా ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన 13 మంది ప్రముఖులకు వరించిన పద్మ అవార్డులు. పూర్తి జాబితా ఇక్కడ చూడండి.

భారత గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గానూ అత్యున్నత పౌర పురస్కారాలైన 'పద్మ' అవార్డులను ప్రకటించింది. ఆదివారం విడుదల చేసిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు తమ ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఈ ఏడాది మొత్తం 5 మందికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మ భూషణ్‌, 113 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించగా.. ఇందులో ఏపీ, తెలంగాణ నుండి మొత్తం 13 మంది ఎంపికయ్యారు.

వైద్య రంగంలో నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్‌ ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారిని కేంద్రం 'పద్మభూషణ్‌' పురస్కారంతో గౌరవించింది. వైద్య రంగంలో ఆయన చేసిన నిరుపమాన సేవలకు గానూ ఈ గుర్తింపు లభించింది. అలాగే యూజీసీ మాజీ ఛైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ గారు ఢిల్లీ కోటాలో పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.

కళాకారుల హవా.. రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్‌లకు చోటు సినీ రంగం నుంచి 'నటకిరీటి' గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ నటుడు మరియు మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్‌లను 'పద్మశ్రీ' వరించింది. కళాకారుల విభాగంలో వీరిద్దరితో పాటు నృత్యకారిణి దీపికారెడ్డి కూడా ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు.

తెలుగు రాష్ట్రాల పద్మశ్రీ గ్రహీతల పూర్తి జాబితా:


విజేత పేరురంగంరాష్ట్రంఅవార్డు
నోరి దత్తాత్రేయుడువైద్యంఅమెరికా (తెలుగు వ్యక్తి)పద్మ భూషణ్
గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్కళలు (సినీ రంగం)ఆంధ్రప్రదేశ్పద్మశ్రీ
మాగంటి మురళీ మోహన్కళలు (సినీ రంగం)ఆంధ్రప్రదేశ్పద్మశ్రీ
దీపికా రెడ్డికళలు (కూచిపూడి నృత్యం)తెలంగాణపద్మశ్రీ
పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డివైద్యం (క్యాన్సర్ నిపుణులు)తెలంగాణపద్మశ్రీ
గూడూరు వెంకట్ రావువైద్యంతెలంగాణపద్మశ్రీ
మామిడాల జగదీశ్ కుమార్సాహిత్యం, విద్యఢిల్లీ కోటా (తెలంగాణ వ్యక్తి)పద్మశ్రీ
కుమారస్వామి తంగరాజ్సైన్స్ అండ్ ఇంజినీరింగ్తెలంగాణపద్మశ్రీ
చంద్రమౌళి గడ్డమనుగుసైన్స్ అండ్ ఇంజినీరింగ్తెలంగాణపద్మశ్రీ
కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణియన్సైన్స్ అండ్ ఇంజినీరింగ్తెలంగాణపద్మశ్రీ
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం)కళలు (సంగీతం)ఆంధ్రప్రదేశ్పద్మశ్రీ
వెంపటి కుటుంబ శాస్త్రిసాహిత్యం, విద్యఆంధ్రప్రదేశ్పద్మశ్రీ
రామారెడ్డి మామిడి (మరణానంతరం)పశుసంవర్ధక, పాడి పరిశ్రమతెలంగాణపద్మశ్రీ


వివిధ రంగాలలో విశేష కృషి చేస్తూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ మట్టిలో మాణిక్యాలను కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలతో సత్కరించింది. మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీరు ఈ అవార్డులను అందుకోనున్నారు.
Show Full Article
Print Article
Next Story
More Stories