Anakapalle: వికటించిన ఇంజెక్షన్.. ఏకంగా 22 మందికి వణకు, వాంతులతో తీవ్ర అస్వస్థత

Anakapalle: అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వాస్పత్రిలో ఇంజక్షన్ వికటించి 22 మంది అస్వస్థతకు గురయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 July 2024 10:10 AM IST
Patients Ill After Taking Injection in Nakkapalli Govt Hospital
X

Anakapalle: వికటించిన ఇంజెక్షన్.. ఏకంగా 22 మందికి వణకు, వాంతులతో తీవ్ర అస్వస్థత

Anakapalle: అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వాస్పత్రిలో ఇంజక్షన్ వికటించి 22 మంది అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన వారికి మంగళవారం సెఫోటాక్సిన్ ఇంజక్షన్ ఇవ్వడంతో తీవ్రమైన వణుకు, వాంతులకు గురైనట్లు బాధితులు తెలిపారు. దీంతో వారందరినీ అంబులెన్సుల్లో నక్కపల్లి ప్రభుత్వాస్పత్రి నుంచి అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story