Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ 'టైగర్' పవన్ కళ్యాణ్: జపనీస్ యుద్ధకళలో అరుదైన గౌరవం.. తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు!

Pawan Kalyan
x

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ 'టైగర్' పవన్ కళ్యాణ్: జపనీస్ యుద్ధకళలో అరుదైన గౌరవం.. తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు!

Highlights

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అరుదైన అంతర్జాతీయ ఘనత! జపనీస్ కత్తిసాము కళ ‘కెంజుట్సు’లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా గుర్తింపు. ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’ బిరుదుతో సత్కారం.

Pawan Kalyan: జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ తన యుద్ధ కళా నైపుణ్యంతో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన ‘కెంజుట్సు’ (Kenjutsu) లో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా ఈ ఘనత సాధించిన ఏకైక తొలి తెలుగు వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు.

మూడు దశాబ్దాల సుదీర్ఘ సాధన:

సినిమాలు, రాజకీయాల్లోకి రాకముందే చెన్నైలో మార్షల్ ఆర్ట్స్ ప్రయాణాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్, మూడు దశాబ్దాలకు పైగా నిరంతర సాధన చేశారు. కరాటేతో మొదలుపెట్టి, జపనీస్ సమురాయ్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేశారు. ఆయన సినిమాలైన 'తమ్ముడు', 'ఖుషి', 'ఓజీ' (OG) చిత్రాల్లో మనం చూసిన మార్షల్ ఆర్ట్స్ విన్యాసాల వెనుక సంవత్సరాల తరబడి చేసిన కఠిన శిక్షణ ఉంది.



అంతర్జాతీయ గుర్తింపులు ఇవే: పవన్ కళ్యాణ్ సాధించిన ఈ అరుదైన మైలురాళ్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి:

టకెడా షింగెన్ క్లాన్: జపాన్ వెలుపల ‘సోకే మురమత్సు సెన్సై’లోని ప్రతిష్టాత్మక ‘టకెడా షింగెన్ క్లాన్’లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తి పవన్ కళ్యాణ్.

ఫిఫ్త్ డాన్ (5th Dan) పురస్కారం: జపాన్ సంప్రదాయ యుద్ధకళల సంస్థ ‘సోగో బుడో కన్‌రి కై’ నుంచి ఆయనకు ఈ గౌరవం లభించింది.

టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్: గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ద్వారా ఆయనను ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’ అనే విశిష్ట బిరుదుతో సత్కరించారు.

ఉన్నత స్థాయి శిక్షణ: ప్రముఖ బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ మార్గదర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ‘కెండో’ మరియు ఇతర యుద్ధకళల్లో అత్యున్నత స్థాయి నైపుణ్యాన్ని సంపాదించారు.

సిద్ధాంతం - క్రమశిక్షణ: యుద్ధకళ అంటే కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు, అది ఒక క్రమశిక్షణతో కూడిన జీవన తత్వమని పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతారు. అంతర్జాతీయ వేదికపై సినిమా, యుద్ధ తత్వశాస్త్రం (Martial Philosophy) మరియు శాస్త్రీయ యుద్ధకళలను సమన్వయం చేసిన అతికొద్ది మంది భారతీయుల్లో ఒకరిగా ఆయన నిలిచారు.

ఈ అరుదైన గౌరవం పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు మార్షల్ ఆర్ట్స్ సాధకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories