ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ... మంత్రులకు సీఎం చంద్రబాబు సూచనలు

Pm modi
x

Pm modi

Highlights

PM Modi to visit Amaravati: ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మే 2న మోదీ ఏపీలో పర్యటించనున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి...

PM Modi to visit Amaravati: ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మే 2న మోదీ ఏపీలో పర్యటించనున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. మోదీ పర్యటనకు సంబంధించిన వివరాలను తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు వెల్లడించారు.

రాబోయే మూడేళ్లలో ఏపీకి శాశ్వత సచివాలయం, ఏపీ అసెంబ్లీ, ఏపీ కోర్టు నిర్మాణాల లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు.

జిల్లాల్లో ఇంచార్జ్ మంత్రులు పర్యటించే క్రమంలో కూటమి నేతల మధ్య సమన్వయం చెడిపోకుండా మూడు పార్టీల నేతలు ఉండేలా చూసుకోవాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు.

ప్రజా సమస్యల విషయానికొస్తే, రెవిన్యూ సమస్యలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా తెలిపారు. అలాగే సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం లేకుండా చూసుకోవాల్సిందిగా మంత్రులకు స్పష్టంచేశారు.

ప్రజల్లో సౌర విద్యుత్ వినియోగం పెరిగేలా ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం ప్రారంభించిన పీఎం సూర్య ఘర్: ముఫ్తి బిజిలి యోజన పథకం అమలులో వేగం పెంచాలని చంద్రబాబు స్పష్టంచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories