విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఘనస్వాగతం పలకనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!

Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు.
Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. విశాఖపట్నం వేదికగా జరగనున్న పలు అధికారిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. రాష్ట్రపతి రాకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం సమయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆమెకు ఘనస్వాగతం పలకనున్నారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు విశాఖలోనే పర్యటించనున్నారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో విశాఖ నగరంలో పోలీసులు అపూర్వ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి ఆమె పర్యటించే ప్రాంతాల వరకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ట్రాఫిక్ ఆంక్షలతో పాటు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ (QRT) నిరంతరం నిఘా ఉంచాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



