Pulasa Special: గోదావరి జిల్లాలో పులస పండుగ మొదలైంది

Pulasa Special
x

Pulasa Special: గోదావరి జిల్లాలో పులస పండుగ మొదలైంది

Highlights

Pulasa Special: పుస్తులు అమ్మైనా పులస కూర తినాలని అంటారు. ఎందుకంటే పులస అంత ఖరీదు ఉంటుంది మరి. పైగా ఆ పులస కూర ఎంతో టేస్టీ. ఏ ఇతర చేపల కూరలు పులస కూర ఉన్నంత టేస్ట్ ఉండవు.

Pulasa Special: పుస్తులు అమ్మైనా పులస కూర తినాలని అంటారు. ఎందుకంటే పులస అంత ఖరీదు ఉంటుంది మరి. పైగా ఆ పులస కూర ఎంతో టేస్టీ. ఏ ఇతర చేపల కూరలు పులస కూర ఉన్నంత టేస్ట్ ఉండవు. జూలై నెలలో గోదావరి నదికి వరదలు వచ్చినపుడు సముద్రంలోంచి ఈ చేపలు ఎదురీదుతూ వస్తాయి. చాలా అరుదుగా దొరికే పులస కూరను తినాలని ఎంతోమంది గోదావరి జిల్లాలకు పయనమవుతారు.

వర్షాకాలంలో మాత్రమే దొరికే అరుదైన చేపలు.. పులస చేపలు. పులసకు ఎంత డిమాండ్ అంటే.. ఒక్క చేప 25 వేల రూపాయలు ఖరీదు ఉన్నా కొనడానికి వెనుకాడరు. ఇక వలలో ఒక్క చేప చిక్కిందంటే ఆ జాలరికి ఎంత సంబరమో చెప్పనవసరం లేదు. తాజాగా యానాం ఫిష్ మార్కెట్‌లో ఒక చేప కనిపించింది. దీంతో పులస ప్రియులకు పండుగ మొదలైంది.

వలలో ఒక్క చేప దొరకడంతో దాన్ని వేలం వేశారు. ఈ వేలంలో దీని ధర కేవలం 4 వేల రూపాయలు పలికింది. కానీ మామూలుగా అయితే పులస చేప ధర 15 వేల రూపాయల నుంచి 25వేల రూపాయల వరకు ఉంటుంది. అయితే ఇంకా గోదావరిలో నీటి ప్రవాహం పూర్తిగా మారలేదు కాబట్టి దీని ధర ఇప్పుడు కాస్త తక్కువ పలికింది.

బంగాళాఖాతంలోంచి గోదావరిలో పులస చేపలు ఎదురీదుతూ వస్తాయి. వర్షాలు ఎక్కువగా పడినప్పుడు ఆ వరద నీరు సముద్రంలోంకి కలిసిపోతుంది. ఆ సమయంలో గోదావరి నీళ్లు రంగు మారతాయి. అదే సమయంలో అప్పటివరకు సముద్రంలో ఉన్న పులసలు సముద్రంలోకి వస్తున్న గోదావరి నీళ్లకు ఎదురెళ్లి.. నదిలో జీవిస్తాయి. అయితే ఇదే సమయంలో చేపలను పడతారు. దీంతో ఈ చేపలు వలలో చిక్కుకుంటాయి. ఉప్పు నీటిలోంచి మంచినీటిలోకి రావడం వల్ల ఈ చేపలు ఎక్కువగా రుచిగా ఉంటాయి.

పులస..ఇలస ఒకటేనా?

గోదావరి నీరు రంగు మారినప్పుడు సముద్రంలోంచి ఎదురీదుతూ వచ్చే చేపలు పులస చేపలు. అలాగే గోదావరి నదిలో నీళ్లు రంగు మారకుండా సముద్రంలోంచి వచ్చే చేపలను ఇలస చేపలు అంటారు. మామూలుగా చెప్పాలంటే ఈ రెండు ఒకటే కానీ ఇలస్ చేపల కూర అంత రుచిగా ఉండదు. కానీ పులస కూర చాలా రుచిగా ఉంటుంది. అందుకే ఇలసలు తక్కువ రేటుకు వెళ్లిపోతాయి. కానీ పులసలు మాత్రం వేల రూపాయల్లో ఉంటాయి.

గోదావరి జిల్లాల్లో క్రేజ్

ఈ చేపలు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా దొరుకుతాయి. అందుకే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ సీజన్ రాగానే అక్కడకు పయనమవుతారు. మరికొంతమంది పులస చేపలు వచ్చిన సమయంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే అంత క్రేజీ చేపను వండి వడ్డిస్తే ఆ క్రేజే వేరు కదా. అందుకే చాలా మంది ఈ చేపల కూర ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుంటారు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనూ..

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లలో కూడా పులస చేపలు దొరుకుతాయి. అక్కడ వాళ్లు కూడా ఈ చేపను ఇష్టంగా తింటారు. ఈ సీజన్‌లో ఈ చేపలు రాగానే పెద్ద ఫెస్టివల్‌గా సంబరాలు చేసుకుంటారు.

అంత క్రేజ్ ఎందుకు?

ఒకప్పుడు పులస చేపను మామూలు చేపల్లానే చూసేవారు. కానీ ఆ తర్వాత దీనికి క్రేజ్ పెరిగిపోవడంతో డిమాండ్ పెరిగిపోయింది. దీనివల్ల సాధారణ ప్రజలెవ్వరూ దీన్ని కొనే స్థితిలో లేరు. కనీసం ఈ సంవత్సరమైనా పులసను తినాలని చాలామంది అనుకుంటారు. కానీ 25వేలు 30 వేలు దాటే రేట్లను చూసి ఆ పనిని విరమించుకుంటారు. అయితే దీనికి క్రేజ్ పెరగడానికి ఇంకొక కారణం ఇవి ఎక్కువగా ఉండవు. దొరికిన చేపలను అందుకే వేలంలో వేస్తుంటారు. ఆ అదృష్టం ఎవరికి ఉంటుందో వాళ్లే ఆ చేపను కొనగలుగుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories