ఆ రాత్రి సీఐడీ ఆఫీసులో ఏం జరిగింది? పోలీసుల విచారణకు హాజరైన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్!

ఆ రాత్రి సీఐడీ ఆఫీసులో ఏం జరిగింది? పోలీసుల విచారణకు హాజరైన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్!
Raghu Rama Krishna Raju Custodial Torture Case: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (RRR) 'కస్టడీలో హత్యాయత్నం' కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Raghu Rama Krishna Raju Custodial Torture Case: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (RRR) 'కస్టడీలో హత్యాయత్నం' కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏడో నిందితుడిగా (A-7) ఉన్న బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఎట్టకేలకు పోలీసుల విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గుంటూరులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తు అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.
విజయనగరం ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ
దర్యాప్తు అధికారి, విజయనగరం ఎస్పీ దామోదర్ నేతృత్వంలో సునీల్ నాయక్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 9వ తేదీ వరకు ఈ విచారణ కొనసాగనుంది. 2021 మే నెలలో రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన సమయంలో జరిగిన పరిణామాలపై పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నావళిని సిద్ధం చేశారు.
ఏమిటీ కేసు?
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును దేశద్రోహం కేసులో సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఉంచిన సమయంలో తనను చిత్రహింసలకు గురిచేసి, హత్యాయత్నం చేశారని రఘురామ గతంలో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో సీఐడీ డీఐజీగా ఉన్న సునీల్ నాయక్, అర్థరాత్రి వేళ పలుమార్లు సీఐడీ కార్యాలయానికి వెళ్లినట్లు దర్యాప్తులో ఆధారాలు లభించాయి. దీంతో పోలీసులు ఆయనను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.
హైకోర్టు ఆదేశాలతో విచారణకు..
గతంలో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా సునీల్ నాయక్ స్పందించలేదు. చివరకు పోలీసులు పాట్నా వెళ్లినా సాంకేతిక కారణాల వల్ల ఆయనను తీసుకురాలేకపోయారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం సునీల్ నాయక్ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆయనకు షరతులతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. విచారణకు సహకరించాలని స్పష్టం చేయడంతో ఆయన నేడు పోలీసుల ఎదుట హాజరయ్యారు. నేటి నుంచి 9వ తేదీ వరకు సాగే ఈ విచారణలో సునీల్ నాయక్ ఇచ్చే సమాచారం ఈ కేసులో అత్యంత కీలకం కానుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



