Raghurama Krishna Raju: RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం


Raghurama Krishna Raju: RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం
Raghurama Krishna Raju: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Raghurama Krishna Raju: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను గుంటూరు పోలీసులు బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వం హయాంలో రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన సమయంలో, కస్టడీలో ఆయనపై అమానుషంగా భౌతిక దాడి జరిగిందని నమోదైన కేసులో సునీల్ నాయక్ నిందితుడిగా ఉన్నారు.
అప్పట్లో సీఐడీ విభాగంలో పనిచేసిన ఆయన, రఘురామపై జరిగిన దాడిలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. కేసు దర్యాప్తును స్పీడప్ చేసి పోలీసులు సునీల్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను ఏపీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులపై విచారణ జరుగుతోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



