రెస్టారెంట్లలో తినే ముందు మూడు సార్లు ఆలోచించండి.. ఆరోగ్యానికి అతి పెద్ద ముప్పు వస్తోందట!

రెస్టారెంట్లలో తినే ముందు మూడు సార్లు ఆలోచించండి.. ఆరోగ్యానికి అతి పెద్ద ముప్పు వస్తోందట!
x

రెస్టారెంట్లలో తినే ముందు మూడు సార్లు ఆలోచించండి.. ఆరోగ్యానికి అతి పెద్ద ముప్పు వస్తోందట!

Highlights

రుచికరమైన వంటకాలు తినాలన్న ఆలోచనతో రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లే వారికి ఇప్పుడు ఇది ఒక బిగ్ అలర్ట్‌. మీరు వాంఛించి ఆర్డర్ చేస్తున్న ఫుడ్‌ వెజ్ కావొచ్చు, నాన్‌వెజ్ కావొచ్చు.. రుచి చూసేలోపే అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయబోతుందన్న విషయం తెలుసా?

విశాఖపట్నం: రుచికరమైన వంటకాలు తినాలన్న ఆలోచనతో రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లే వారికి ఇప్పుడు ఇది ఒక బిగ్ అలర్ట్‌. మీరు వాంఛించి ఆర్డర్ చేస్తున్న ఫుడ్‌ వెజ్ కావొచ్చు, నాన్‌వెజ్ కావొచ్చు.. రుచి చూసేలోపే అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయబోతుందన్న విషయం తెలుసా? బయట తినే వంటల్లో నాణ్యత ఉందా? ఫ్రెష్ గానా వాడుతున్నారా అనే దానిపై ఎవ్వరూ శ్రద్ధ చూపడం లేదు. ఈ నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని హోటళ్లు పూర్తిగా నిషేధించాల్సిన స్థాయిలో జాగ్రత్తలేని తిండిని వడ్డిస్తున్నాయి.

తాజా ఉదాహరణ విశాఖలోనే..

విశాఖపట్నంలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా రెస్టారెంట్లు, హోటళ్లపై దాడులు నిర్వహించగా.. షాకింగ్ విజువల్స్ బయటపడ్డాయి. 15 రోజులుగా నిల్వ పెట్టిన మసాలాలు, కుళ్లిన చికెన్‌, పాడైన చేపలు, ముద్దైపోయిన పీతలు, రొయ్యలు.. ఇవన్నీ కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. పాడైన ఆహారం వల్లే కొంతమంది అనారోగ్యానికి గురవుతున్నారని గుర్తించారు.

ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన సమయం

సాంబార్ బాగుంది, చికెన్ రుచి గొప్పగా ఉంది అనుకుంటూ తింటే చాలు. కడుపు నిండుతుంది కానీ ఆరోగ్యం బలహీనమవుతుంది. డబ్బులివ్వడం కన్నా, శరీరానికి ప్రమాదం తలెత్తేలా వ్యవహరిస్తున్నారు హోటళ్ల నిర్వాహకులు.

ఫుడ్‌ సేఫ్టీ విభాగం సీరియస్

ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఈ నిర్వాహకులపై అధికారులు కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. తక్షణ చర్యలు తీసుకుంటామని, ఇలా వాడిపోయిన పదార్థాలతో వంటలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.

మీ ఆరోగ్యానికి మించి ఏం లేదు. రెస్టారెంట్లలో తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి!

Show Full Article
Print Article
Next Story
More Stories