స్వపక్షంలో విపక్షం: పొన్నూరులో నరేంద్ర vs రోశయ్య ఘర్షణ

స్వపక్షంలో విపక్షం: పొన్నూరులో నరేంద్ర vs రోశయ్య ఘర్షణ
x

స్వపక్షంలో విపక్షం: పొన్నూరులో నరేంద్ర vs రోశయ్య ఘర్షణ

Highlights

పొన్నూరును టీడీపీకి కంచుకోటగా మార్చిన ధూళిపాళ్ల నరేంద్ర ఏడు సార్లు పొన్నూరు ఎమ్మెల్యేగా గెలుపు నాలుగు దశాబ్దాలుగా నియోజకవర్గంతో విడతీయలేని బంధం చేజారుతూ వస్తోన్న మంత్రి పదవి

పొన్నూరును టీడీపీకి కంచుకోటగా మార్చిన ధూళిపాళ్ల నరేంద్ర

నాలుగు దశాబ్దాలుగా నియోజకవర్గంతో విడతీయలేని బంధం

చేజారుతూ వస్తోన్న మంత్రి పదవి

2019 ఎన్నికల్లో నరేంద్రపై కిలారి రోశయ్య గెలుపు

సంగం డైరీ వ్యవహారంలో జైలుకు

2024 ఎన్నికల్లో రోశయ్య గుంటూరు ఎంపీగా పోటీ

2024 ముందు వరకు ఢీ అంటే ఢీ

ధూళ్లిపాళ్ల నరేంద్ర.. కిలారి రోశయ్య ఒకే కూటమి పక్షులు

ధూళ్లిపాళ్ల నరేంద్ర.. కిలారి రోశయ్య మధ్య మాటల యుద్దం

కార్యకర్తలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమంటూ నరేంద్ర వార్నింగ్

హద్దు మీరుతున్న వారిని వదిలేది లేదని రోశయ్యపైకి బాణాలు

అధికార పార్టీకి ఆ నియోజకవర్గం కంచుకోట. మూడు దశాబ్దాలకు పైగా ఒక్కరే ఎమ్మెల్యే. పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఎందాకైనా వెల్లే నాయకుడాయన. అధికారంలోకి వచ్చాం ఇక ఐదేళ్లు సాఫీగా సాగుతుంది అనుకుంటే అనుకొని కుదుపు చోటు చేసుకుంది. అధికార మార్పిడితో మిత్రపక్షంలో విపక్ష నేతలు చేరారు. మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న నేతలు.. ఒకే కూటమి గొడుగు కిందకు చేశారు. ఐనా వర్గపోరు రాజకీయం మాత్రం మారలేదు. పక్కనే ఉంటూ రాజకీయం చేస్తున్నారు. దీంతో ఎప్పుడూ సహనంగా ఉండే ఈ ఎమ్మెల్యే ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారుతోంది... ఇంతకీ ఏంటా నియోజకవర్గం.. ఎవరా సీనియర్.. ఏం జరుగుతోంది.


ఉమ్మడి గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గం ఒకటి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ కు గణనీయమై చరిత్ర ఉంది. మూడు దశాబ్దాలకుపైగా ఒకే కుటుంబం నుంచి తండ్రీ.. ఆయన తనయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఏడు సార్లు పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో మాత్రమే ఓడిపోయారు. మొత్తంగా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయనకు ఈ నియోజకవర్గంతో విడతీయ లేని బంధం ఏర్పడింది. వైఎస్ హయాంలో టీడీపీ ఆటు పోట్లను ఎదుర్కొన్నా ఇక్కడ మాత్రం పసుపు ఎండాను రెపరెపలాడించారు దూళిపాళ్ల. పార్టీని భుజాన మోసారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి పదవి ఖాయమని భావించిన ప్రతిసారీ చేజారుతూ వస్తోంది. గత ఎన్నికలోనూ అదే జరిగింది. అయినా పార్టీపైన నరేంద్ర ఎక్కడా వ్యతిరేకత చూపించలేదు....


2019 ఎన్నికల్లో నరేంద్రపైన పొన్నూరు నుంచి కిలారి రోశయ్య వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ అయిదేళ్ల కాలంలో రోశయ్య ఎమ్మెల్యేగా.. ధూళ్లిపాళ్లను ఇబ్బందులకు గురి చేశారు. అంతేకాదు సంగం డైరీ వ్యవహారంలో అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయినా ధూళ్లిపాళ్ల మాత్రం నియోజకవర్గంలో అక్రమ క్వారీ త్రవ్వకాలు, భావనారాయణ స్వామి భూముల అక్రమాలపై పోరాటం చేసారు. కాగా 2024 ఎన్నికల్లో రోశయ్యను గుంటూరు ఎంపీగా పోటీ చేయించారు వైసీపీ అధినేత జగన్. పొన్నూరు నుంచి అంబటి మురళీని వైసీపీ రంగంలోకి దించింది. కూటమి హవాలో తిరిగి నరేంద్ర ఏడవసారి ఎమ్మెల్యేగా గెలు పొందారు. అంతా సాఫీగా సాగుతుంది అనుకున్న టైంలో పొన్నూరు నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయం మారింది. 2024కి ముందు..ఢీ అంటే ఢీ అని తలబడిన ధూళ్లిపాళ్ల నరేంద్ర.. కిలారి రోశయ్య ఒకే కూటమి పక్షులు అయ్యారు. కూటమి అధికారంలోకి రావడంతో.. 2024కి ముందు వైసీపీలో ఉన్న కిలారి రోశయ్య జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో పొన్నూరు రాజకీయం కీలక మలుపు తీసుకుంది. మిత్రపక్షంలో ఉంటూనే నరేంద్రకు మాత్రం స్వపక్షంలో విపక్షంగా మారారు రోశయ్య. ఇద్దరు నేతలకు మద్దతు ఇచ్చే వారితో రెండు పార్టీల శ్రేణుల మధ్య వివాదాలు పరిపాటిగా మారాయి.


పేరుకే కూటమి పార్టీ నేతలు. కానీ కొంత కాలంగా ధూళ్లిపాళ్ల నరేంద్ర.. కిలారి రోశయ్య మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. పరోక్షంగా ఒకరిని మరొకరు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమంటూ స్వయంగా సిట్టింగ్ ఎమ్మెల్యే నరేంద్ర వార్నింగ్ ఇవ్వటం సంచలనంగా మారింది. ఈ హెచ్చరికతో మిత్రపక్షంలో ఉన్న నాటి రాజకీయ ప్రత్యర్థి రోశయ్య ఆత్మరక్షణలో పడ్డారు. నరేంద్ర - రోశయ్య మధ్య మారుతున్న రాజకీయంతో నియోజకవర్గంలో కూటమి పరిస్థితులు వేడెక్కుతున్నాయి. మాజీ ఎమ్మెల్యె రోశయ్య, ఆయన అనుచరుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నరేంద్ర..... వైసీపీలో పని చేసిన నేతలు.. కార్యకర్తలు జనసేనలో చేరి టీడీపీ కేడర్ ను ఇబ్బంది పెడుతున్నారని మండి పడ్డారు. అంతటితో ఆగలేదు. టిడిపి కార్యకర్తల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదంటూ చేసిన హెచ్చరిక కూటమి నేతల్లో సంచలనంగా మారింది......


హద్దు మీరుతున్న వారిని వదిలేది లేదని రోశయ్యపైకి బాణాలు ఎక్కుపెట్టారు ధూళిపాళ్ల. నా యుద్దం నేనే చేస్తానంటూ స్వపక్షంలోనే విపక్షంగా మారిన వారికి వార్నింగ్ ఇచ్చారు. ఒక స్థాయి వరకు ఓపికగా ఉంటా హద్దు మీరితే తానేంటో చూపిస్తానంటూ హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఇప్పుడు కూటమి నేతల్లో పెద్ద ఎత్తున చర్చనీయంశగా మారాయి. బూత్ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో నరేంద్ర ఆవేశం చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఎమ్మెల్యే కామెంట్స్ తో నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లలో క్రేజ్ పెరిగిందట.. మరి.. ఈ వివాదం రానున్న రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకుంటుందో.. ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఉత్కంఠ గా మారుతోంది....

Show Full Article
Print Article
Next Story
More Stories